గద్ద – కోడిపిల్ల

Feb 25,2024 11:16 #chirumuvallu, #Sneha

పిల్లలందరూ ఆటస్థలంలో ఒకరి చేతులు ఒకరు పట్టుకొని గుండ్రంగా నిలబడాలి. ఒక పిల్లవాడు గద్దలాగా, మరొక పిల్లవాడు కోడిపిల్లలాగా అనుకోవాలి. కోడిపిల్ల పిల్లల మధ్య, గద్ద బయట వుంటుంది.

గద్ద కోడిపిల్లను పట్టుకోవాలి. అందుకోసం వలయాన్ని దాటుకొని లోపలికి దూరడానికి ప్రయత్నిస్తుంది. చేతులు చేతులు పట్టుకొన్న పిల్లలు గ్రద్దను లోపలికి రాకుండా చూడాలి. ఒకవేళ గద్ద లోపలికి వస్తే కోడిపిల్ల బయటకు పారిపోతుంది. దానికి పిల్లలందరూ సహకరించాలి.

ఇపుడు గద్దను బయటకు పోనీకుండా అడ్డుకోవాలి. ఈ ఆట ఆడేటప్పుడు పిల్లలందరూ ‘గద్దా వచ్చే కోడిపిల్ల కుయ్యాం కుయ్యాం’ అని అరుస్తూ వుండాలి. గద్ద కోడిపిల్లను పట్టుకుంటే మరో జంట రంగంలోకి వస్తుంది. పట్టుకోక పోయినా నిర్దిష్ట సమయం తర్వాత మరో జంట రంగంలోకి రావాలి.

ఈ ఆట ఏవయస్సు పిల్లలైనా ఆడవచ్చు కనీసం 15 మంది పిల్లలు లేకపోతే ఈ ఆట రక్తి కట్టదు.

➡️