నేను కవిని

Apr 21,2024 11:59 #Sneha

నా హృదయాంతరాళాల్లోని భావాలు
విహంగములై, నీలాకాశంలో
స్వేచ్ఛగా విహరిస్తుంటాయి
స్వార్ధపు రెక్కలను విరిచి
నిస్వార్ధపు తోటలో విహరించే
‘నా మది దొంతరలు’
కలచివేసిన హృదయోపద్రవాల
అనుభూతులు కొలువుదీరితేనో,
పరాభవాల అనుభవాలను స్మరిస్తేనో,
కడలి తరంగాలై ఉరకలెత్తుతాయి
ఒత్తిడికి గురైన మనసుకు,
మలయ సమీరపు హాయినందించే
‘ప్రేమకు’ విశ్వజనీనతను ఆపాదిస్తాయి
నా చిలిపి ఊహలు
నా ఈ అనుభూతుల సమాహారాలు
అక్షరసుమాలై
భావపరిమళాలను వెదజల్లుతూ,
చైతన్య బావుటానెగరేస్తూ,
మురిపించి, మైమరపించి
మనసులను రంజింపజేస్తాయి
దీనినే కవిత్వమంటాను నేను,
మరి.. నేను కవిని!

వేమూరి శ్రీనివాస్‌
9912128967

➡️