వస్తువులతో ఆట..

Mar 24,2024 09:24 #chirumuvallu, #Sneha

1, 2 తరగతుల పిల్లలకు ఎక్కువ సమయం పాఠాలు బోధిస్తే చెప్పిన విషయాలు మెదడులో గుర్తు ఉండవని విద్యావేత్తలు చెబుతున్నారు. అందుకే వారికి ఒక పాఠానికి, మరొక పాఠానికి మధ్యలో తరగతి గదిలోనే కూర్చొబెట్టి సృజనాత్మకత పెరిగేలా చిన్న చిన్న వస్తువులు ఉపయోగించి బొమ్మలు గీయడం, పెయింటింగ్‌ వేయించడం చేస్తూ ఉండాలి. ఎలా ఆడాలో చూద్దాం.
ఆట : పిల్లలను బయటకు వెళ్లి గ్రౌండ్‌లో పనికిరాని పుల్లలు, రాళ్లు, ఆకులు సేకరించుకుని రమ్మనాలి. పిల్లల్ని ఇద్దరూ లేదా ముగ్గురు గ్రూపులుగా విడకొట్టాలి. వారు సేకరించుకొని వచ్చిన వస్తువులను వివిధ నమూనాలుగా పెట్టేలా సహకరించాలి. ప్రతి విద్యార్థి ముందూ టీచరు ఒక బొమ్మ గీసి దానిపై, రాళ్లను, గింజలను పేర్చమనాలి. తర్వాత కూడా పిల్లలు తాము సేకరించుకొని వచ్చిన వస్తువులు ఉపయోగించి తమకు నచ్చిన రీతిలో మరొక బొమ్మను ఏర్పరచమనాలి. ఇలా ఆడించడం వల్ల పిల్లలకు కంటికి, చేతికి సమన్వయం, సృజన పెరుగుతుంది.

➡️