వ్యత్యాసం

Jan 21,2024 09:05 #Poetry
poetry on soldiers

సరిహద్దుల్లో వాళ్ళు

సరిముద్దుల్లో వీళ్ళు

కంచెగా వాళ్ళు

కంచె మేస్తూ వీళ్ళు

అక్కడ-

పూటలు మారతాయి

చేతులు మారతాయి

చేష్టలే మారవు

ఇక్కడ-

పొద్దుకో తిరుగుడు

రాజ్యమే జెండా

నిరంకుశమే వారి అజెండా

బోర్డరంటే నువ్వు గీసి ఆడే

మైదానంలో గీత కాదు

బోర్డరంటే ఏ క్షణంపైనా

బతుకు నమ్మకం లేని

వీరసైనికుల మానవహారం..!!!

 

  • బండి అనూరాధ
➡️