సంతోషంగా విహారయాత్ర

Feb 4,2024 06:55 #Sneha
school tour

స్కూలు యాజమాన్యం పోయిననెలలో విజయవాడకు విహారయాత్ర తీసుకెళ్లింది. వెళ్లేటప్పుడు బస్సులో స్నేహితులతో బాగా ఆడుకున్నాను. అలాగే మేము అందరం ఇంటి దగ్గర నుండి కొన్ని తినే పదార్థాలు, చిరుతిళ్లు తీసుకెళ్లాం. మొదట బాపు మ్యూజియంకు వెళ్ళాము. ఒక గదిలో మన మహనీయుల విగ్రహాలు ఉన్నాయి. ఆ తర్వాత మరొక గదిలో మానవుడు ఎలా పుట్టారు? ఎలా పరిణామం చెందాడు? అప్పట్లో వాడే వస్తువులు, అప్పటి గనులు, విగ్రహాలు, అప్పటి ఆయుధాలు, కత్తులు చూశాను. తర్వాత రెండో ఫ్లోర్‌కి వెళ్ళాము. అక్కడ రాజుల కాలం నాటి ఆయుధాలు, వాడే వారో? చూపించారు. అది చాలా బాగా నచ్చింది.బయట గ్రౌండ్‌లో స్నేహితులతో మళ్ళీ ఆడుకున్నాను. తర్వాత రాజీవ్‌ గాంధీ పార్క్‌కు వెళ్లాం. మొదటిగా గడ్డి మీద కూర్చుని భోజనం చేశాము. తర్వాత కొంచెం సేపు నడిచాము, ఆడుకున్నాము. అక్కడ చాలా చెట్లు, పువ్వులు, పళ్ళు ఉన్నాయి. వాటి దగ్గర ఫోటోలు కూడా దిగాము. నా స్నేహితులతో చాలా ఆటలు ఆడాను. అక్కడికి వేరే స్కూలు వాళ్ళు కూడా వచ్చారు. దాంతో పార్కు అంతా సందడిగా కనిపించింది. నా స్నేహితులతో ఇది నా మొదటి విహారయాత్ర. సాయంత్రం తిరిగి బయలుదేరాము. బస్సులో నా స్నేహితురాలు చాలా జోకులు చెప్పింది. నవ్వుతూ బడికి వచ్చేశాము. తిరిగి ఇంటికి వచ్చేశాను. మా అమ్మకు, నాన్నకు, చెల్లికి విహారయాత్ర గురించి చెప్పాను. తర్వాత మా చెల్లి వాళ్లు కూడా, నేను వెళ్ళిన విహారయాత్రకు వెళ్లారు.

– డి.భవ్యశ్రీ, 6వ తరగతి, కుంచనపల్లి, గుంటూరు జిల్లా.

➡️