సచివాలయానికి మరమ్మతులు

  • మంత్రుల ఛాంబర్లలో సమూల మార్పులు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : కొత్త ప్రభుత్వం కొలువు తీరుతున్న వేళ రాష్ట్ర సచివాలయంలో మరమ్మతు పనులు జోరుగా సాగుతున్నాయి. అలాగే మంత్రులకు కేటాయిస్తున్న ఛాంబర్ల పనులు కూడా నిర్విరామంగా జరుగుతున్నాయి. ఈ కారణంగానే మంత్రుల బాధ్యతల స్వీకరణలో జాప్యం జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. 2016లో తాత్కాలిక సచివాలయంలోకి ప్రభుత్వ శాఖలు వచ్చినప్పటి నుంచి అనేక సమస్యలు నెలకొంటున్నాయి. కారిడార్లలో నేలపై పలకలు విరిగిపోవడం, కొన్ని అదృశ్యమవడం, ఈ ప్రాంతాల్లో గుంతలు ఏర్పడి నడిచేవారికి తీవ్ర ఇబ్బందులు నెలకొనడం తరచూ జరుగుతుండేది. అలాగే అన్ని భవనాల్లో గోడలు బీటలువారడం కూడా కనిపించిరది. ఇన్నాళ్లూ వీటిని పట్టించుకోని యంత్రాంగం ఇప్పుడు హడావుడిగా పగుళ్లు కనిపించకుండా తెల్లటి సున్నం రాయడం, పలకలను కొత్తగా తెప్పించి వేయడం వంటి చర్యలు తీసుకుంటుంది. అలాగే మంత్రుల అభీష్టం మేరకు ఛాంబర్లలో కూడా భారీ మార్పులు చేస్తున్నారు. కొత్త కొత్త ఫర్నీచర్లను తెప్పించి అలంకరణలు చేస్తున్నారు.

➡️