కొత్త ఆర్థిక సంవత్సరంలోనైనా ఆర్థిక కష్టాలు తీరేనా ?

Apr 1,2024 12:32 #financial difficulties

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : గత మూడు నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఆర్థిక ఇబ్బరదులు రాష్ట్ర ప్రభుత్వాన్ని చివరివరకు వెంటాడాయి. దీంతో ఏప్రిల్‌ ఒకటి నుండి ప్రారంభం కానున్న నూతన ఆర్థిక సంవత్సరంలోకి అప్పుల భారంతో అడుగుపెట్టాల్సివస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక స్థితి ఎలా ఉంటుందన్నది అధికరవర్గాల్లో చర్చనీయంశంగా మారింది.

కేంద్రం సహాయ నిరాకరణ
నిదుల పంపిణీ విషయంలో కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణి రాష్ట్రానికి ఇబ్బందికరంగా మారుతోంది. ప్రతియేటా కేంద్రం నురచి రావాల్సిన నిధుల విడుదల తగ్గుతోంది. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా నిధులు, పలు కేంద్ర పథకాలకు రావాల్సిన నిధుల్లో కూడా కోతలు పడుతున్నాయి. ఎవరు అధికారంలోకి వచ్చినా కేంద్రంలోని ప్రభుత్వం అనుసరించే ధోరణి కీలకంగా మారనుంది. మరోవైపు కొత్త ఆర్థిక సంవత్సరం ప్రత్యేకంగా ఎన్నికల ఏడాది కావడంతో ఖర్చులు మరిరత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా తొలి రెరడు నెలలైన ఏప్రిల్‌, మేలు ఆర్థికశాఖకు కీలకం కానురది. కొంత కాలంగా ఒకటో తేదీన జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండాపోయిరది. దీరతో ఆ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి, ఆరదోళన పెరిగిపోయిరది. అరదుకే సోమవారం నురచి ప్రారంభరకానున్న కొత్త ఆర్థిక సంవత్సరంలోనైనా ఉద్యోగుల ఆగ్రహాన్ని కొంతమేరకైనా తగ్గిరచాలంటే జీతాలు, పిరఛన్లు ఒకటి, రెరడు తేదీల్లోనే చెల్లిరచాల్సి ఉరటురది.

పాత భారం కొత్త ఏడాదిపై
2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక కష్టాల కారణంగా వేల కోట్ల బిల్లులను చెల్లిరచలేకపోయారు. దీరతో అనేక బిల్లులను వచ్చే ఏడాదికి బదలాయిరచగా, మరికొన్ని బిల్లులను వెనకకు పరపిరచి వేశారు. ఇవన్నీ 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే చెల్లిరచాల్సి ఉరటురది. దీరతో కొత్త సంవత్సరం ఖజానాపై అదనపు భారంపడనుంది. గత ఏడాది సవరించిన బడ్జెట్‌ అంచనాల ప్రకారం ప్రభుత్వం ప్రతిష్టగా చెప్పుకునే సంక్షేమ పథకాలకు సంబంధిరచిన సామాజిక రంగంలో కూడా రూ. 35 వేల కోట్లు తక్కువగా ఖర్చు చేశారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి త్వరలో ఏర్పాటుకానున్న కొత్త ప్రభుత్వానికి సవాలుగానే మారనురది. ఇప్పుడున్న ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చినా, కొత్తగా కూటమి అధికారంలోకి వచ్చినా ఆర్థిక నిర్వహణ కత్తిమీద సాములాంటిదేనని ఆర్థికశాఖ అధికారులే అభిప్రాయపడుతురడడం గమనార్హం.

➡️