అంతర్జాతీయ క్రికెట్‌కు ఆఫ్ఘన్‌ బ్యాటర్‌ నూర్‌ అలీ జడ్రాన్‌ గుడ్‌బై

Mar 8,2024 22:05 #Sports

కాబూల్‌: అంతర్జాతీయ క్రికెట్‌కు ఆఫ్ఘనిస్తాన్‌ బ్యాటర్‌ నూర్‌ అలీ జడ్రాన్‌ గుడ్‌బై చెప్పాడు. తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ఆఫ్ఘనిస్తాన్‌ క్రికెట్‌బోర్డుకు ట్విట్టర్‌ వేదికగా గురువారం రాత్రి తెలిపాడు. 2009లో స్కాట్లాండ్‌తో మ్యాచ్‌తో అంతర్జాతీయంగా వన్డేల్లో అరంగేట్రం చేసిన జడ్రాన్‌..51 వన్డేల్లో ఆఫ్ఘనిస్తాన్‌ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. అలాగే 2టెస్టుల్లో, 23టి20ల్లోనూ ప్రాతినిధ్యం వహించిన జడ్రాన్‌.. 1930పరుగులు చేయగా.. అందులో 11 అర్ధసెంచరీలున్నాయి. 2010లో తొలిసారి టి20ల్లో అరంగేట్రం చేసిన జడ్రాన్‌.. శ్రీలంకతో స్వదేశంలో జరిగిన టెస్ట్‌తో ఆ ఫార్మట్‌లోనూ ప్రాతినిధ్య ంవహించాడు. 2010 టి20 ప్రపంచకప్‌లో తొలిసారి భారత్‌పై అర్ధసెంచరీతో మెరిసాడు.

➡️