ఆస్ట్రేలియా లక్ష్యం 279

Mar 10,2024 22:30 #Sports

ప్రస్తుతం 77/4న్యూజిలాండ్‌తో రెండోటెస్ట్‌

క్రైస్ట్‌చర్చ్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో, చివరి టెస్ట్‌లో ఆతిథ్య న్యూజిలాండ్‌ జట్టు పట్టు బిగించింది. రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ జట్టు 372పరుగులకు ఆలౌట్‌ కావడంతో ఆసీస్‌ జట్టు ముందు 279పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఛేదనలో ఆసీస్‌ జట్టు మూడోరోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 77పరుగులు చేసింది. ఆదివారం మూడోరోజు ఆటను కొనసాగించిన కివీస్‌ను రవీంద్ర(82), విలియమ్సన్‌(51), మిఛెల్‌(58) అర్ధసెంచరీలతో ఆదుకున్నారు. ఆ తర్వాత కుగ్లెజిన్‌(44) ఫర్వాలేదనిపించడంతో న్యూజిలాండ్‌ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో భారీస్కోర్‌ను నమోదు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌కు 94పరుగుల ఆధిక్యత సాధించిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా బౌలర్లు కమిన్స్‌కు నాలుగు, లియాన్‌కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆసీస్‌ను హెన్రీ, బెన్‌ సీర్స్‌ కట్టడి చేశారు. వీరి స్మిత్‌(9), ఖవాజా(11), లబూషేన్‌(6), గ్రీన్‌(5)లను స్వల్ప స్కోర్లకే పెవీలియన్‌కు చేర్చారు. ఆసీస్‌ జట్టు ఓ దశలో 34పరుగులకే 4వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత హెడ్‌(17), మిఛెల్‌ మార్ష్‌(27) మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఆసీస్‌ జట్టు మరో 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉండగా.. న్యూజిలాండ్‌ జట్టు మరో 6 వికెట్లు కూల్చితే విజయం ఖాయం కానుంది. తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా జట్టు 172పరుగుల తేడాతో నెగ్గిన సంగతి తెలిసిందే.

➡️