ఆస్ట్రేలియా 116/2-పాకిస్తాన్‌తో చివరి టెస్ట్‌

Jan 4,2024 22:23 #Sports

సిడ్నీ: పాకిస్తాన్‌ాఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్ట్‌ రెండోరోజు ఆటకు వెలుతురులేమి వెంటాడింది. వెలుతురులేమి కారణంగా ఆట నిలిచే సమయానికి ఆస్ట్రేలియా 47ఓవర్లలో 2వికెట్ల నష్టానికి 116పరుగులు చేసింది. ఓవర్‌నైట్‌ బ్యాటర్స్‌ వార్నర్‌(34), ఖవాజా(47) వికెట్లను చేజార్చుకున్న ఆసీస్‌.. ఆ తర్వాత లబూషేన్‌(23), స్టీవ్‌ స్మిత్‌(6) మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడారు. తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్‌ 313పరుగులు చేయగా.. అమీర్‌ జమాల్‌, అఘా సల్మాన్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. ఈ టెస్ట్‌ తర్వాత టెస్ట్‌లకు ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇక మూడు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-0 ఆధిక్యతలో ఉంది.

➡️