ఇంగ్లండ్‌ గెలుపు-వెస్టిండీస్‌తో రెండో వన్డే

Dec 7,2023 22:30 #Sports

ఆంటిగ్వా: తొలి వన్డేలో వెస్టిండీస్‌ చేతిలో ఓడిన ఇంగ్లండ్‌.. రెండో వన్డేలో సత్తాచాటింది. బుధవారం రాత్రి జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్‌ జట్టు 6వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ జట్టు 39.4ఓవర్లలో 202పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ హోప్‌(68), రూథర్‌ఫోర్డ్‌(63) అర్ధసెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్‌ బౌలర్లు శామ్‌ కర్రన్‌, లివింగ్‌స్టోన్‌కు మూడేసి, అట్కిన్సన్‌, రెహాన్‌ అహ్మద్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం ఇంగ్లండ్‌ జట్టు 32.5ఓవర్లలో 4వికెట్లు కోల్పోయి 206పరుగులు చేసి గెలిచింది. విల్‌ జాక్‌(73), జాస్‌ బట్లర్‌(58) అర్ధసెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్‌ బౌలర్లు మోటీకి రెండు, షెఫర్డ్‌, రూథర్డ్‌ఫర్డ్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ సామ్‌ కర్రన్‌కు లభించగా.. మూడో, చివరి వన్డే శనివారం(9న) బార్బొడాస్‌ వేదికగా జరగనుంది.

➡️