ఇక వన్డే సమరం .. హెడ్‌ కోచ్‌గా సితాన్షు

Dec 16,2023 22:15 #Sports

మధ్యాహ్నం 1.30గం||ల నుంచి

జహన్నెస్‌బర్గ్‌: ఐదు టి20ల సిరీస్‌ను 4-1తో చేజిక్కించుకున్న టీమిండియా.. ఇక వన్డే సిరీస్‌పై గురిపెట్టింది. దక్షిణాఫ్రికాతో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే జహన్నెస్‌బర్గ్‌ వేదికగా జరగనుంది. వన్డే సిరీస్‌లో రజత్‌ పటీధర్‌, సాయి సుదర్శన్‌ కొత్తగా బరిలోకి దిగనున్నారు. కెఎల్‌ రాహుల్‌ సారథ్యంలోని భారతజట్టులో శ్రేయస్‌, తిలక్‌ వర్మతోపాటు సంజు శాంసన్‌ వికెట్‌ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు బిసిసిఐ ముగ్గురు కెప్టెన్లకు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక హెడ్‌ కోచ్‌గా సౌరాష్ట్ర మాజీ ఆటగాడు సితాన్షు కోటక్‌ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. బిసిసిఐ శనివారం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. టి20 సిరీస్‌కు ప్రధాన కోచ్‌గా వ్యవహరించిన రాహుల్‌ ద్రావిడ్‌కు వన్డే సిరీస్‌ నుంచి విశ్రాంతి కల్పించారు. ద్రావిడ్‌ స్థానంలో అలాగే, వన్డే సిరీస్‌ లో అజరు రాత్రా, రాజిబ్‌ దత్తా ఫీల్డింగ్‌, బౌలింగ్‌ కోచ్‌లుగా వ్యవహరించనున్నారు. వీరందరూ బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ సిబ్బంది.జట్లు(అంచనా)…

భారత్‌: కెఎల్‌ రాహుల్‌(కెప్టెన్‌), రజత్‌ పటీధర్‌, సాయి సుదర్శన్‌, తిలక్‌ వర్మ, సంజు శాంసన్‌(వికెట్‌ కీపర్‌), అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌, ఆర్ష్‌దీప్‌, ముఖేశ్‌ కుమార్‌, ఆవేశ్‌ ఖాన్‌.

దక్షిణాఫ్రికా: మార్‌క్రమ్‌(కెప్టెన్‌), హెన్రిక్స్‌, జోర్జి, డుస్సెన్‌, క్లాసెన్‌(వికెట్‌ కీపర్‌), డేవిడ్‌ మిల్లర్‌, ముల్డర్‌, ఫెల్హులియో, కేశవ్‌ మహరాజ్‌, వర్గర్‌, విలియమ్స్‌.

➡️