ఓటమి అంచున ఆంధ్ర-ముంబయితో రంజీమ్యాచ్‌

Jan 14,2024 22:20 #Sports

ముంబయి: రంజీట్రోఫీ రెండో లీగ్‌ మ్యాచ్‌లో ఆంధ్రజట్టు ఓటమి అంచున నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో ముంబయిని 395పరుగులకు ఆలౌట్‌ చేసినా.. తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 184పరుగులకే ఆలౌటైంది. ఆదివారం ఫాలోఆన్‌ ఆడుతూ రెండో ఇన్నింగ్స్‌లో 165పరుగులకే 5వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆంధ్ర జట్టులో విహారి(46), కెప్టెన్‌ రికీ బురు(28)కి తోడు రషీద్‌(52) అర్ధసెంచరీకి తోడు నితీశ్‌ కుమార్‌(22) క్రీజ్‌లో ఉన్నారు. మూడోరోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర జట్టు 45పరుగులు వెనుకబడి ఉంది. నేడు ఆంధ్రజట్టు ఆలౌట్‌ అవ్వకుండా ఉంటేనే ఓటమిబారినుంచి బయటపడనుంది. హైదరాబాద్‌ గెలుపు.. మరో గ్రూప్‌లో హైదరాబాద్‌ జట్టు ఇన్నింగ్స్‌ 81పరుగుల తేడాతో మేఘాలయపై ఘన విజయం సాధించింది. హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌లో 7వికెట్ల నష్టానికి 346పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేసింది. అనంతరం మేఘాలయను తొలి ఇన్నింగ్స్‌లో 111పరుగులకు రెండో ఇన్నింగ్స్‌ 154పరుగులకు ఆలౌట్‌ చేసింది. దీంతో ప్లేట్‌ గ్రూప్‌లో హైదరాబాద్‌ జట్టు వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచింది.రియాన్‌ పరాగ్‌ మరో సెంచరీఅస్సాం కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ మరో శతకంతో మెరిసాడు. ఈ రంజీ సీజన్‌లో రియాన్‌కు ఇది వరుసగా రెండో శతకం. చత్తీస్‌ఘడ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కేవలం 87 బంతుల్లోనే 11 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 155 పరుగులు చేసిన రియాన్‌.. కేరళపై 116పరుగులతో రాణించాడు. కేరళతో జరుగుతున్న అస్సాం జట్టు 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న దశలో క్రీజ్‌లోకి వచ్చిన రియాన్‌ సెంచరీతో ఆదుకున్నాడు. దీంతో అస్సాం జట్టు మూడోరోజు ఆట ముగిసే సమయానికి 7వికెట్ల నష్టానికి 231పరుగులు చేసింది. ఇక కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 419 పరుగులకు ఆలౌటైంది.

➡️