దక్షిణాఫ్రికాకు ఆధిక్యత-న్యూజిలాండ్‌తో రెండోటెస్ట్‌

Feb 14,2024 22:30 #Sports

హామిల్టన్‌: రెండో టెస్ట్‌లో దక్షిణాఫ్రికాకు 31పరుగుల కీలక ఆధిక్యత లభించింది. రెండోరోజైన బుధవారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆతిథ్య న్యూజిలాండ్‌ జట్టు దక్షిణాఫ్రికా బౌలర్లు పిడిట్‌(5/89), పీటర్సన్‌(3/39) కట్టడి చేశారు. దీంతో న్యూజిలాండ్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 211పరుగులకే పరిమితమైంది. ఓపెనర్‌ లాథమ్‌(40), కేన్‌ విలియమ్సన్‌(43), యంగ్‌(36), రచిన్‌ రవీంద్ర(29)కి తోడు లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ వాగర్‌(33) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా జట్టు 242పరుగులకే పరిమితమైన సంగతి తెలిసిందే. రెండు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మౌంట్‌ ముఘనరు వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో న్యూజిలాండ్‌ జట్టు 281పరుగుల తేడాతో నెగ్గి 1-0 ఆధిక్యతలో ఉంది.

➡️