T20 World Cup: ఓపెనర్‌గా కోహ్లి విఫలం

Jun 26,2024 06:46 #Sports
  • రెండుసార్లు డకౌట్‌
  • మరో రెండుసార్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితం
  • ఈ జోడీతో ట్రోఫీ కొట్టేనా..?

బార్బొడాస్‌: టి20 ప్రపంచకప్‌లో టీమిండియా కొత్త ఓపెనర్లతో బరిలోకి దిగింది. రోహిత్‌ శర్మావిరాట్‌ కోహ్లి కాంబినేషన్‌లో సరిక్రొత్త ప్రయోగానికి తెరలేపిన బిసిసిఐ ఆ ప్రయోగంలో పూర్తిగా విఫలమైంది. కోహ్లి ఓపెనర్‌గా పూర్తిగా విఫలం కాగా.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అంచనాలకు మించి రాణిస్తున్నాడు. ఈ టోర్నీ లీగ్‌లో ఆడిన మూడు మ్యాచుల్లో కోహ్లి చేసింది ఐదు పరుగులే. పాకిస్తాన్‌పై 4పరుగులు చేస్తే.. ఐర్లాండ్‌పై ఒక్క పరుగు మాత్రమే చేశాడు. ఇక అమెరికాపై ఏకంగా డకౌటయ్యాడు. ఓపెనర్‌గా వచ్చిన ఆరు మ్యాచుల్లో కోహ్లి రెండు మ్యాచుల్లో డకౌట్‌ కాగా.. సూపర్‌ా8లో ఆఫ్ఘనిస్తాన్‌పై 24, బంగ్లాదేశ్‌పై 37పరుగులు చేసి కాస్త ఫర్వాలేదనిపించాడు. ఇక సోమవారం ఆస్ట్రేలియాపై డకౌటై మరోసారి నిరాశపరిచాడు. ఈ టోర్నీలో కోహ్లి ఆడిన ఆరు మ్యాచుల్లో చేసింది 66పరుగులే. అంటే ఒక్కో మ్యాచ్‌కు యావరేజ్‌గా అతడు చేసింది 11పరుగులే. అయినా టీమిండియా మేనేజ్‌మెంట్‌ అతడిపై నమ్మకాన్ని వదులుకోవడం లేదు.
కలిసిరాని ఓపెనింగ్‌..
రోహిత్‌ శర్మావిరాట్‌ కోహ్లి ఓపెనింగ్‌ కాంబినేషన్‌ కలిసిరావడం లేదనేది సగటు ప్రేక్షకుల వాదన. ఐపిఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) తరఫున ఓపెనర్‌గా రాణించాడన్న ఒక్క నమ్మకంతో ఈ మెగా టోర్నీలో అతడు ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్నాడు. వీరిద్దరి భాగస్వామ్యంలో ఒక్క అర్ధసెంచరీ భాగస్వామ్యం కూడా లేదు. మరోవైపు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఓపెనర్‌గా రెండు అర్ధసెంచరీలతో కదం తొక్కినా.. కోహ్లి చేసిన అత్యధిక పరుగులు 37 మాత్రమే. గతంలో ఎడమ, కుడిచేతి కాంబినేషన్‌లో భాగస్వామ్యంలో టీమిండియా ఎన్నో రికార్డులను నెలకొల్పింది. సౌరవ్‌ గంగూలీాసచిన్‌ టెండూల్కర్‌, గౌతమ్‌ గంభీర్‌ాసెహ్వాగ్‌తోపాటు ఇటీవలికాలంలో శుభ్‌మన్‌ గిల్‌ాజైస్వాల్‌.. ఇలా ఎడమ, కుడిచేతి కాంబినేషన్‌ ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. ఇది ఎంతవరకు మేలు చేస్తుందనేది జట్టు మేనేజ్‌మెంట్‌కే ఎరు.

టి20 టోర్నీలో కోహ్లి రోహిత్‌ తొలివికెట్‌కు భాగస్వామ్యం

ఐర్లాండ్‌పై 1 52 22
పాకిస్తాన్‌పై 4 13 12
అమెరికాపై 0 3 1

ఆఫ్ఘనిస్తాన్‌ 24 8 11
బంగ్లాదేశ్‌ 37 23 39
ఆస్ట్రేలియా 0 92 6

➡️