పంజాబ్‌ కింగ్స్‌ హెడ్‌ కోచ్‌గా సంజయ్ బంగర్‌

Dec 8,2023 21:34 #IPL, #Sports
punjab kings head coach sanjay bangar

మొహాలీ: పంజాబ్‌ కింగ్స్‌ హెడ్‌ కోచ్‌గా మాజీ వికెట్‌ కీపర్‌ సంజయ్ బంగర్‌ ఎంపికయ్యాడు. ఈ మేరకు ఆ ఫ్రాంచైజీ శుక్రవారం ట్విటర్‌ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. పంజాబ్‌ కింగ్స్‌ సిఇవో సతీష్‌ మీనన్‌ ట్విటర్‌లో.. సంజయ్ అనుభవజ్ఞుడైన కోచ్‌ మరియు సహాయ సిబ్బందితో గట్టి సంబధాలను కలిగి ఉన్నాడు. అతని సామర్థ్యంపై గట్టి నమ్మకముందని, రాబోయే సీజన్‌లో పంజాబ్‌ జట్టు మెరుగైన ప్రదర్శన కనబరుస్తుందని ఆశిస్తుందన్నారు. గతంలో బంగర్‌ తమ ఫ్రాంచైజీకి హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించారని, ప్రస్తుతం కోచ్‌గా ఉన్న ట్రేవర్‌ బెలీస్‌ పదవీ కాలం ముగియడంతో బంగర్‌ను కోచ్‌గా ఎంపిక చేసినట్లు ఆయన పేర్కొన్నారు. 51ఏళ్ల బంగర్‌ గతంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు రెండు సీజన్‌లకు కోచ్‌గానూ వ్యవహరించారు.

➡️