పాకిస్తాన్‌ 132/2ఆస్ట్రేలియాతో తొలిటెస్ట్‌

Dec 15,2023 22:20 #Sports

పెర్త్‌: పెర్త్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా భారీస్కోర్‌ చేసింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 487 పరుగులకు ఆలౌటైంది. డేవిడ్‌ వార్నర్‌(164) భారీ శతకానికి తోడు రెండో రోజు మిడిలార్డర్‌ బ్యాటర్‌ మిచెల్‌ మార్ష్‌(90) తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్స్‌ మిచెల్‌ స్టార్క్‌(12), కమిన్స్‌(9), నాథన్‌ లయన్‌(5) సాయంతో మిఛెల్‌ మార్ష్‌ బ్యాట్‌తో చెలరేగాడు. పాక్‌ బౌలర్లలో అరంగేట్రం పేసర్‌ ఆమిర్‌ జమాల్‌ ఆరు వికెట్ల ప్రదర్శనతో అరదగొట్టగా.. మరో అరంగ్రేటం బౌలర్‌ ఖుర్రమ్‌ షెహజాద్‌ 2, షాహీన్‌ అఫ్రిది, ఫహీమ్‌ అష్రాఫ్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పాకిస్తాన్‌ శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. అబ్దుల్లా షఫీక్‌(42), కెప్టెన్‌ షాన్‌ మసూద్‌(30) ఔట్‌ కాగా.. ఇమామ్‌ ఉల్‌ హాక్‌ 38, ఖుర్రమ్‌ షెహజాద్‌ 7 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. పాక్‌జట్టు ఇంకా 355 పరుగులు వెనకపడి ఉండగా.. ఈ సిరీస్‌ తర్వాత ఆసీస్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ టెస్ట్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు.

➡️