పోరాడి నెగ్గిన దక్షిణాఫ్రికా

Jan 19,2024 22:25 #Sports

వెస్టిండీస్‌పై 31పరుగుల తేడాతో గెలుపు

జహన్నెస్‌బర్గ్‌: ఐసిసి అండర్‌19 పురుషుల వన్డే ప్రపంచకప్‌ టోర్నీ తొలిరోజునుంచే హోరాహోరీగా ప్రారంభమైంది. గ్రూప్‌-బిలో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు నిర్దేశించిన 286పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్‌ జట్టు 6వికెట్ల నష్టానికి 240పరుగులు చేసి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించినా.. ఆ తర్వాత 14పరుగుల వ్యవధిలో మిగిలిన వికెట్లను కోల్పోయింది. దీంతో దక్షిణాఫ్రికా జట్టు సంచలన విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 285పరుగులు చేసింది. దేవాన్‌(65), జువాన్‌(47), డేవిడ్‌ టీగర్‌(44) బ్యాటింగ్‌లో రాణించగా.. నాథన్‌ సిలీకి మూడు, దేశాన్‌, నాథన్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం వెస్టిండీస్‌ జట్టు 40.1 ఓవర్లలో జువెల్‌(130), నాథన్‌(33) బ్యాటింగ్‌లో రాణించారు. క్వేనా మాఫాకాకు ఐదు, రిలీ నార్టన్‌కు మూడు వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ క్వేనా మఫాకాకు లభించింది. ఇక గ్రూప్‌ాఏలో ఐర్లాండ్‌ జట్టు ఏడు వికెట్ల తేడాతో అమెరికాను చిత్తుచేసింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన అమెరికా జట్టు 40.2ఓవర్లలో 105పరుగులకే ఆలౌట్‌ కాగా.. ఆ లక్ష్యాన్ని ఐర్లాండ్‌ జట్టు 22.5ఓవర్లలో 3వికెట్లు కోల్పోయి 109 పరుగులు కొట్టి గెలిచింది. ఐర్లాండ్‌ జట్టులో ర్యాన్‌ హంటర్‌(50నాటౌట్‌) అర్ధసెంచరీతో మెరిసాడు.

ఐసిసి అండర్‌19 ప్రపంచకప్‌లో రేపు .స్కాట్లాండ్‌ × ఇంగ్లండ్‌

బంగ్లాదేశ్‌ × ఇండియా(మధ్యాహ్నం 1.30గం||ల నుంచి)

➡️