ప్రతిష్టాత్మక అవార్డు రేసులో మెస్సీ, కోహ్లి

Dec 31,2023 18:00 #Sports

క్రీడారంగానికి సంబంధించిన ఓ ప్రతిష్టాత్మక అవార్డు కోసం ఇద్దరు దిగ్గజాలు పోటీపడుతున్నారు. ప్యూబిటీ అథ్లెట్‌ ఆఫ్‌ ద ఇయర్‌ 2023 అవార్డు కోసం క్రికెట్‌ విరాట్‌ కోహ్లి.. ఫుట్‌బాల్‌ లెజెండ్‌ లియోనల్‌ మెస్సీతో అమీతుమీకి సిద్దమయ్యాడు. ఈ అవార్డు కోసం కోహ్లి-మెస్సీ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతుంది. ఇద్దరూ ఈ ఏడాది తమతమ క్రీడా విభాగాల్లో అత్యుత్తమంగా రాణించి అవార్డు రేసులో నిలిచారు. కోహ్లి ఈ ఏడాది ఆధ్యాంతం పరుగుల వరద పారించగా.. మెస్సీ ఏడాది పొడువునా గోల్స్‌ వర్షం కురిపించాడు. ప్యూబిటీ అథ్లెట్‌ ఆఫ్‌ ద ఇయర్‌ 2023 అవార్డు కోసం కోహ్లీ, మెస్సీతో పాటు వివిధ క్రీడలకు చెందిన వందల మంది స్టార్‌ క్రీడాకారులు పోటీ పడగా.. చివరిగా రేసులో ఈ ఇద్దరే మిగిలారు. మెస్సీ, కోహ్లితో పాటు ఈ అవార్డు కోసం మరో దిగ్గజ ఫుట్‌బాలర్‌ క్రిస్టియానో రొనాల్డో, బాక్సింగ్‌ దిగ్గజం మహమ్మద్‌ అలీ, బాస్కెట్‌బాల్‌ లెజెండ్‌ మైఖేల్‌ జోర్డాన్‌ పోటీపడ్డారు. త్వరలో మెస్సీ, కోహ్లిలలో ఒకరిని ఓటింగ్‌ ద్వారా విజేతగా ప్రకటిస్తారు.

➡️