ప్రి క్వార్టర్స్‌కు బొప్పన్న జోడీ

Feb 28,2024 22:20 #Sports

దుబాయ్ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌

దుబాయ్: దుబాయ్ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌ టోర్నీలో బొప్పన్నాఎబ్డెన్‌, యుకీ బాంబ్రీ-హాస్‌ జంటలు శుభారంభం చేశాయి. మంగళవారం రాత్రి జరిగిన తొలిరౌండ్‌ పోటీలో బొప్పన్నాఎబ్డెన్‌ జంట 7-6(7-4), 7-6(7-5)తో మన్సోరి(ట్యునీషియా)-ఖురేషీ(పాకిస్తాన్‌) జంటను చిత్తుచేశారు. ఈ మ్యాచ్‌ సుమారు గంటా 41నిమిషాలసేపు సాగింది. మరో మ్యాచ్‌లో యుకీ బాంబ్రీ-రాబిన్‌ హాస్‌ జంట 6-7(8-6), 6-3, 10-8తో బబ్లిక్‌(కజకిస్తాన్‌)-మన్నారినో(ఫ్రాన్స్‌) జంటను చిత్తుచేసి ప్రి క్వార్టర్స్‌కు చేరారు. ఇక భారత సింగిల్స్‌ స్టార్‌ ప్లేయర్‌ సుమిత్‌ నాగల్‌ రౌండ్‌-32లో పరాజయాన్ని చవిచూశాడు. హోరాహోరీగా సాగిన ఈ పోటీలో సుమిత్‌ 4-6, 7-5, 1-6తో ఇటలీకి చెందిన లారెంజో సొనేగో చేతిలో ఓడాడు.

➡️