ప్రి క్వార్టర్స్‌కు శ్రీకాంత్‌, మంజునాథ్‌

Jan 31,2024 22:10 #Sports

థాయ్ లాండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ

బ్యాంకాక్‌: థారులాండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. బుధవారం జరిగిన తొలిరౌండ్‌ పోటీలో మిధున్‌ మంజునాథ్‌, కిదాంబి శ్రీకాంత్‌ ప్రత్యర్థులను చిత్తుచేసి రెండోరౌండ్‌కు చేరగా.. సమీర్‌ వర్మ, కిరణ్‌ జార్జి తొలిరౌండ్‌లోనే నిష్క్రమించారు. మిధున్‌ మంజునాథ్‌ 21-17, 21-8తో గుణవాన్‌(హాంకాంగ్‌), కిదాంబి శ్రీకాంత్‌ 22-20, 21-17తో జియాంగ్‌-జన్‌-హి(మలేషియా)ను వరుససెట్లలో ఓడించారు. ఇక కిరణ్‌ జార్జి 17-21తో తొలిసెట్‌ చేజార్చుకున్నాక.. గాయంతో మ్యాచ్‌నుంచి వైదొలిగాడు. దీంతో చైనా షట్లర్‌ లి-వాన్‌ రెండోరౌండ్‌కు చేరాడు. మరో పోటీలో సమీర్‌ వర్మ 14-21, 18-21తో 8వ సీడ్‌ లాంగ్‌ అంగస్‌(హాంకాంగ్‌) చేతిలో పోరాడి ఓడాడు. మరో పోటీలో ముత్తుస్వామి సుబ్రమణియన్‌ 21-14, 21-17తో లింగ్‌-జున్‌-హుయా(మలేషియా)ను చిత్తుచేసి ప్రి క్వార్టర్స్‌కు చేరాడు. ఇక మహిళల సింగిల్స్‌లో అస్మిత ఛాలిహా 21-10, 21-19తో వాంగ్‌-లింగ్‌(మలేషియా), మాల్విక బన్సోద్‌ 22-20, 21-8తో ఇన్నిస్‌ లూసియా(పెరూ)ను చిత్తుచేశారు. మరో పోటీలో ఇమద్‌ ఫారూఖీ 14-21, 18-21తో బూసానన్‌(థారులాండ్‌) చేతిలో పరాజయాన్ని చవిచూసింది.

➡️