ఫైనల్‌కు సబలెంక, జెంగ్‌

Jan 25,2024 22:05 #Sports

అమెరికా యువ సంచలనం గాఫ్‌ ఔట్‌..

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ ఫైనల్లోకి డిఫెండింగ్‌ ఛాంపియన్‌, అర్యానా సబలెంక(బెలారస్‌), చైనాకు చెందిన కిన్వెన్‌ జెంగ్‌ ప్రవేశించారు. గురువారం జరిగిన సెమీస్‌ఫైనల్లో వీరు ప్రత్యర్ధులపై వరుససెట్లలో నెగ్గారు. తొలి సెమీస్‌లో సబలెంకా 7ా6(7ా2), 6ా4తో 4వ సీడ్‌, అమెరికా యువ సంచలనం కోకా గాఫ్‌ను వరుససెట్లలో చిత్తుచేసింది. తొలి సెట్‌ను టై బ్రేక్‌లో చేజిక్కించుకున్న సబలెంకా.. రెండో సెట్‌లోనూ 4ా4పాయింట్లతో సమంగా నిలిచింది. ఈ క్రమంలో ఒక పాయింట్‌ను బ్రేక్‌ చేసి ఆ సెట్‌ను చేజిక్కించుకొని వరుసగా రెండో ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 2023లో జరిగిన నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లోనూ సెమీస్‌కు చేరిన సబలెంకా.. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ను చేజిక్కించుకొని.. యుఎస్‌ ఓపెన్‌ రన్నరప్‌గా నిలిచింది. ఓ బిడ్డకు తల్లి అయిన సబలెంక గత ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ను చేజిక్కించుకొని తొలిసారి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. రెండో సెమీస్‌లో చైనాకు చెందిన కిన్వెన్‌ జెంగ్‌ 6ా4, 6ా4తో యాస్టెమ్స్యా(ఉక్రెయిన్‌)ను ఓడించి ఫైనల్‌కు చేరింది. శనివారం జరిగే మహిళల సింగిల్స్‌ టైటిల్‌కై జెంగ్‌ాసబలెంకా తలపడనున్నారు. బప్పన్న చరిత్ర తిరగరాస్తాడా..?ఫైనల్‌కు రోహన్‌ాఎబ్డెన్‌ జోడీభారత టెన్నిస్‌ దిగ్గజం రోహన్‌ బోపన్న మరో ఫీట్‌కు చేరుకున్నాడు. డబుల్స్‌లో టాప్‌ ర్యాంక్‌కు చేరిన మరునాడే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పురుషుల డబుల్స్‌ ఫైనల్‌కు చేరుకున్నాడు. గురువారం జరిగిన సెమీఫైనల్లో బోపన్న, మాథ్యూ ఎబ్బెన్‌ జోడీ థామస్‌ మచాక్‌, ఝాంగ్‌ జిజినె ద్వయాన్ని చిత్తు చేసింది. తొలి సెట్‌ నుంచి దూకుడుగా ఆడిన బోపన్న, ఎబ్డెన్‌ జంట 6-3 3-6 7-6(10-7)తో థామస్‌, ఝాంగ్‌ జోడీని మట్టికరిపించి.. తొలిసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్‌కు దూసుకెళ్లారు. ఈ జంటకు వరుసగా ఇది రెండో టైటిల్‌ పోరు కావడం విశేషం. గత ఏడాది యుఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో బోపన్న, మాథ్యూ జోడీ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. దాంతో, ఈ స్టార్‌ జోడీ ఈసారి టైటిల్‌ కొల్లగొట్టి చరిత్ర తిరగరాయాలనే కసితో ఉంది.

రేపు పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్స్‌

జకోవిచ్‌ × సిన్నర్‌మెద్వదెవ్‌ × జ్వెరేవ్‌

➡️