బంగ్లాదేశ్‌కు ఊరట – మూడో వన్డేలో న్యూజిలాండ్‌పై గెలుపు

Dec 23,2023 22:01 #Sports

సిరీస్‌ 2-1తో కివీస్‌ కైవసం

నేపియర్‌: మూడో, చివరి వన్డేలో బంగ్లాదేశ్‌కు ఊరట లభించింది. న్యూజిలాండ్‌తో శనివారం జరిగిన మూడో వన్డేలో బంగ్లాదేశ్‌ జట్టు 9వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన 31.4ఓవర్లలో 98పరుగులకే కుప్పకూలింది. అనంతరం బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ నజ్ముల్‌ హొసైన్‌ శాంటో(51), అమనుల్‌ హక్‌(37) రాణించడంతో 15.1ఓవర్లలో వికెట్‌ నష్టపోయి 99పరుగులు చేసి గెలిచింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ హసన్‌ షకీబ్‌కు, ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ విల్‌ యంగ్‌కు లభించాయి. ఈ ఓటమితో బంగ్లాపై న్యూజిలాండ్‌ జట్టు స్వదేశంలో 19మ్యాచుల్లో విజయాలకు బ్రేక్‌ పడినట్లయింది.

➡️