బాక్సింగ్‌డే టెస్ట్‌లో ఆసీస్‌ గెలుపు

Dec 29,2023 22:15 #Sports

పాకిస్తాన్‌పై 79పరుగుల తేడాతో విజయం

సిరీస్‌ 2-0తో కైవసం

మెల్‌బోర్న్‌: బాక్సింగ్‌ డే టెస్ట్‌లో పాకిస్తాన్‌పై 79పరుగుల తేడాతో ఆస్ట్రేలియా జట్టు గెలిచింది. పాకిస్తాన్‌కు నిర్దేశించిన 317పరుగుల లక్ష్యాన్ని ముందుంచి 237పరుగులకే ఆలౌట్‌ చేసింది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 6వికెట్ల నష్టానికి 187పరుగుల తేడాతో శుక్రవారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆసీస్‌ జట్టు 262పరుగులకు ఆలౌటైంది. అలెక్స్‌ క్యారీ(53) అర్ధసెంచరీతో రాణించగా.. కెప్టెన్‌ కమిన్స్‌(16) ఆదుకున్నాడు. షాహిన్‌ అఫ్రిది, హంజాకు నాలుగేసి, అఘా సల్మాన్‌కు రెండు వికెట్లు దక్కాయి. దీంతో తొలి ఇన్నింగ్స్‌ 54పరుగులతో కలిపి పాకిస్తాన్‌ ముందు 317పరుగుల లక్ష్యాన్ని ఆసీస్‌ ఉంచింది. ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్‌ జట్టు 237పరుగులకు ఆలౌట్‌ చేసింది. కెప్టెన్‌ షాన్‌ మసూద్‌(60), అఘా సల్మాన్‌(50) అర్ధసెంచరీలతో రాణించగా.. రిజ్వాన్‌(35), సౌద్‌ షకీల్‌(24) ఫర్వాలేదనిపించారు. ఆసీస్‌ బౌలర్లు కమిన్స్‌కు ఐదు, మిఛెల్‌ స్టార్క్‌కు నాలుగు వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ కమిన్స్‌కు లభించింది. దీంతో మూడు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ను ఆసీస్‌ 2ా0తో చేజిక్కించుకోగా.. మూడో, చివరి టెస్ట్‌ జనవరి 3నుంచి సిడ్నీ వేదికగా ప్రారంభం కానుంది. ుుుుుురెండో టి20 వర్షార్పణంన్యూజిలాండ్‌ాబంగ్లాదేశ్‌ సిరీస్‌ మౌంట్‌మౌంగానురు: న్యూజిలాండ్‌ాబంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరగాల్సిన రెండో టి20 వర్షం కారణంగా రద్దయ్యింది. టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ జట్టు 11ఓవర్లలో 2వికెట్ల నష్టానికి 72పరుగులు చేసింది. టిమ్‌ షెఫర్డ్‌(43) బ్యాటింగ్‌లో రాణించగా.. ఫిన్‌ అలెన్‌(2) త్వరగా పెవీలియన్‌కు చేరాడు. మిఛెల్‌(18), ఫిలిప్స్‌(9) క్రీజ్‌లో ఉన్న దశలో భారీ వర్షం కురిసింది. షకీబ్‌, ఇస్లామ్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. ఆ దశలో భారీ వర్షం పడింది. ఎంతసేపటికీ వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో మూడు టి20ల సిరీస్‌లో బంగ్లాదేశ్‌ 1ా0 ఆధిక్యతలో ఉండగా.. మూడో, చివరి టి20 ఆదివారం జరగనుంది.

 

➡️