భారత్‌ ప్రత్యర్ధి ఇండోనేషియా

Mar 22,2024 22:20 #Sports

థామస్‌, ఉబర్‌ కప్‌ డ్రా విడుదల
చెంగ్డు(చైనా): చైనా వేదికగా జరిగే థామస్‌, ఉబర్‌ కప్‌ డ్రా విడుదలైంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత పురుషుల జట్టు గ్రూప్‌ దశలో తొలి మ్యాచ్‌లో ఇండోనేషియాతో తలపడనుంది. ఇక ఉబర్‌ కప్‌లో మహిళల జట్టు తొలిరౌండ్‌లో పటిష్ట చైనాతో గ్రూప్‌ లీగ్‌లో ఆడనుంది. థామస్‌, ఉబర్‌ కప్‌ నిర్వాహకులు శుక్రవారం డ్రా విడుదల చేశారు. గ్రూప్‌ దశలో ప్రతి జట్టు మిగిలిన మూడు జట్లతో ఒక్కోసారి తలపడనున్నాయి. అనంతరం టాప్రతి గ్రూప్‌లో టాప్‌-2లో నిలిచిన జట్లు క్వార్టర్స్‌కు చేరనున్నాయి. ఈ టోర్నమెంట్‌ ఏప్రిల్‌ 27నుంచి మే 5వరకు చైనా వేదికగా జరనుంది.
ఉబెర్‌ కప్‌ డ్రా..
గ్రూప్‌-ఎ: ఇండియా, చైనా, కెనడా, సింగపూర్‌
గ్రూప్‌-బి: థారులాండ్‌, చైనీస్‌ తైపీ, మలేషియా, ఆస్ట్రేలియా
గ్రూప్‌-సి: జపాన్‌, ఇండోనేషియా, హాంకాంగ్‌, ఉగండా
గ్రూప్‌-డి: కొరియా, డెన్మార్క్‌, అమెరికా, మెక్సికో
థామస్‌ కప్‌ డ్రా..
గ్రూప్‌-ఎ: చైనా, కొరియా, కెనడా, ఆస్ట్రేలియా
గ్రూప్‌-బి: జపాన్‌, చైనీస్‌ తైపీ, జర్మనీ, ఛెచియా
గ్రూప్‌-సి: ఇండోనేషియా, ఇండియా, థారులాండ్‌, ఇంగ్లండ్‌
గ్రూప్‌-డి: డెన్మార్క్‌, మలేషియా, హాంకాంగ్‌, అల్జీరియా

➡️