మిఛెల్‌ మెరుపులు-తొలి టి2లో పాక్‌పై కివీస్‌ గెలుపు

Jan 12,2024 22:25 #Sports

అక్లాండ్‌: పాకిస్తాన్‌తో జరిగిన టి20లో న్యూజిలాండ్‌ జట్టు ఘన విజయం సాధించింది. భారీస్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ జట్టు 46పరుగుల తేడాతో గెలిచింది. టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు శుభారంభం దక్కలేదు. జట్టు స్కోర్‌ ఒక్క పరుగువద్ద కాన్వే(0) ఔటయ్యాడు. ఆ తర్వాత అలెన్‌(34; 15బంతుల్లో 3ఫోర్లు, 3సిక్సర్లు), విలియమ్సన్‌(57; 42బంతుల్లో 9ఫోర్లు), మిఛెల్‌(61; 27బంతుల్లో 4ఫోర్లు, 4సిక్సర్లు) విధ్వంస ఇన్నింగ్స్‌ ఆడారు. చివర్లో చాప్మన్‌(26; 11బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు) కూడా రాణించడంతో న్యూజిలాండ్‌ జట్టు 20ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 226పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. పాకిస్తాన్‌ బౌలర్‌, కెప్టెన్‌ షాహిన్‌ అఫ్రిది, అబ్బాస్‌ అఫ్రిది మూడేసి, రవూఫ్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఛేదనలో బాబర్‌(57) అర్ధసెంచరీకి తోడు ఆయుబ్‌(27), రిజ్వాన్‌(25), ఇప్తికార్‌(24) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. లోయర్‌ ఆర్డర్‌ వరుసగా వికెట్లు కోల్పోవడంతో పాక్‌ జట్టు 18ఓవర్లలో 180పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్‌ బౌలర్లు టిమ్‌ సౌథీకి నాలుగు, ఇష్‌ సోథీ, బెన్‌ సీర్స్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ మిఛెల్‌కు లభించింది. దీంతో ఐదు టి20ల సిరీస్‌లో న్యూజిలాండ్‌ 1-0 ఆధిక్యతలో నిలువగా.. రెండో టి20 ఆదివారం హామిల్టన్‌ వేదికగా జరగనుంది.

➡️