ముంబయి బౌలర్ల దెబ్బకుబెంగళూరు ఢమాల్‌

Mar 2,2024 22:05 #Sports

మహిళల ప్రిమియర్‌ లీగ్‌

బెంగళూరు: మహిళల ప్రిమియర్‌ లీగ్‌(డబ్ల్యుపిఎల్‌) రెండో సీజన్‌లో తొలి రెండు మ్యాచుల్లో గెలిచిన బెంగళూరు జట్టు ఆ తర్వాత వరుసగా విఫలమౌతోంది. యుపి వారియర్స్‌, గుజరాత్‌ జెయింట్స్‌పై నెగ్గిన బెంగళూరు.. ఢిల్లీ క్యాపిటల్స్‌ చేతిలో ఓడి.. శనివారం ముంబయిపై తొలిగా బ్యాటింగ్‌కు దిగి ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ముంబయి బౌలర్లు బ్రంట్‌, వాంగ్‌, ఇషిక్‌, వస్త్రాకర్‌ రాణించడంతో బెంగళూరు జట్టు స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. తొలుత కెప్టెన్‌ మంధాన(9), సోఫీ డివైన్‌(9), మేఘన(11), రీచా(7) స్వల్ప స్కోర్లకే పెవీలియన్‌కు చేరడం బెంగళూరు జట్టు 42 పరుగులకే 4వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో ఎలీసా పెర్రీ(44నాటౌట్‌), మెలినెక్స్‌(12) కలిసి 5వ వికెట్‌కు 29పరుగులు జతచేశారు. ఆ తర్వాత మోలినెక్స్‌ ఔటైనా.. వారేహామ్‌(27; 20బంతుల్లో 3ఫోర్లు) ధనా ధన్‌ ఇన్నింగ్స్‌ తోడైంది. చివరి ఓవర్‌ వరకు పెర్రీ క్రీజ్‌లో నిలిచి బెంగళూరు జట్టు గౌరవప్రద స్కోర్‌ చేసేందుకు దోహదపడింది. ముంబయి బౌలర్లు బ్రంత్‌, పూజ వస్త్రాకర్‌కు రెండేసి, వాంగ్‌, ఇషికాకు ఒక్కో వికెట్‌ దక్కాయి.

స్కోర్‌బోర్డు..

బెంగళూరు మహిళల ఇన్నింగ్స్‌: మంధాన (సి)స్కీవర్‌ బ్రంట్‌ (బి)వాంగ్‌ 9, సోఫీ డివైన్‌ (ఎల్‌బి) శిఖా ఇషిక్‌ 9, మేఘన (సి)కీర్తన (బి)స్కీవర్‌ బ్రంట్‌ 11, ఎలీసా పెర్రీ (నాటౌట్‌) 44, రీచా ఘోష్‌ (సి)సజన (బి)వస్త్రాకర్‌ 7, సోఫీ మోలినెక్స్‌ (బి)పూజ వస్త్రాకర్‌ 12, వారేహామ్‌ (సి)కెర్ర్‌ (బి)బ్రంట్‌ 27, శ్రేయాంక (నాటౌట్‌) 7, అదనం 7. (20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి) 131పరుగులు.

వికెట్ల పతనం : 1/14, 2/31, 3/33, 4/42, 5/71, 6/123

బౌలింగ్‌: స్కీవర్‌ బ్రంట్‌ 4-0-27-2, మాథ్యూస్‌ 4-0-29-0, వాంగ్‌ 3-0-20-1, శిఖా ఇషికా 2-0-9-1, అమెలియా కెర్ర్‌ 3-0-20-0, పూజ వస్త్రాకర్‌ 3-0-14-2, కీర్తన 1-0-11-0

➡️