ముంబయి 224ఆలౌట్‌

Mar 10,2024 22:23 #Sports

శార్దూల్‌ అర్ధసెంచరీ

విదర్భతో రంజీట్రోఫీ ఫైనల్‌

ముంబయి: రంజీట్రోఫీ ఫైనల్లో ముంబయి జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 224 పరుగులకే ఆలౌటైంది. వాంఖడే స్టేడియంలో ఆదివారం నుంచి ప్రారంభమైన రంజీట్రోఫీ 2023ా24 సీజన్‌ ఫైనల్లో టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ముంబయిను హర్ష్‌ దూబే, యష్‌ ఠాకూర్‌ దెబ్బకు తొలి ఇన్నింగ్స్‌లో 224పరుగులే చేసింది. ఓపెనర్లు పృథ్వీ షా(46), భూపెన్‌ లాల్వానీ(37) రాణించినా.. ముషీర్‌ ఖాన్‌(6), కెప్టెన్‌ రహానే(7), శ్రేయస్‌ అయ్యర్‌(7) నిరాశపరిచారు. దీంతో ముంబయి జట్టు 111పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో శార్దూల్‌ ఠాకూర్‌(75) అర్ధసెంచరీతో మెరిసాడు. లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్స్‌ సహకారంతో జట్టును గౌరవప్రదస్కోర్‌కు చేర్చి ఆఖరి వికెట్‌గా పెవీలియన్‌కు చేరాడు. దీంతో ముంబయి తొలి ఇన్నింగ్స్‌ 64.3ఓవర్లలో ముగిసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన విదర్భను ముంబయి బౌలర్లు కట్టడి చేశారు. విదర్భ జట్టు తొలి రోజు మూడో సెషన్‌లో మూడు కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్‌ ధ్రువ్‌ షోరే, అమన్‌ మోఖడెతో పాటు కరుణ్‌ నాయర్‌ వికెట్లను కోల్పోయింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి విదర్భ.. 3 వికెట్లు కోల్పోయి 31 పరుగులు చేసింది. ఇంకా ఆ జట్టు 193 పరుగుల వెనుకబడి ఉంది. క్రీజ్‌లో అధర్వ తైదే(21), ఆదిత్య ఠాకరే(0) ఉన్నారు.

➡️