యువ క్రికెటర్ల సత్తాకు పరీక్ష

Jan 18,2024 22:05 #Sports

రేపటి నుంచి అండర్‌19 ప్రపంచకప్‌ టోర్నీ

జహన్నెస్‌బర్గ్‌: అంతర్జాతీయ క్రికెట్‌మండలి(ఐసిసి) అండర్‌-19 ప్రపంచకప్‌ టోర్నీ దక్షిణాఫ్రికా వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. 16జట్ల మధ్య జరిగే మెగా సంగ్రామం నేడు దక్షిణాఫ్రికాావెస్టిండీస్‌ జట్ల మధ్య జరిగే తొలి పోరుతో ప్రారంభం కానుంది. మరోవైపు భారత జట్టు తన తొలి గ్రూప్‌ లీగ్‌ మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో 20న తలపడనుంది. ఈ టోర్నీలో పాల్గంటున్న 16 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. భారతజట్టు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాతోపాటు ఈ టైటిల్‌ను రికార్డుస్థాయిలో ఐదుసార్లు చేజిక్కించుకొని దుర్భేద్య ఫామ్‌లో ఉంది. భారత జట్టుకు రాజస్తాన్‌కు చెందిన ఉదరు సహరన్‌ సారథ్యం వహిస్తున్నాడు. షెడ్యూల్‌ ప్రకారం అండర్‌ 19 వరల్డ్‌ కప్‌కు శ్రీలంక ఆతిథ్యమివ్వాల్సి ఉన్నా.. ఇటీవల లంక క్రికెట్‌ బోర్డును ఐసిసి రద్దు చేయడంతో వేదిక దక్షిణాఫ్రికాకు మారింది. ఈసారి మెగా టోర్నీ నియమాల్లో ఐసిసి మార్పులు చేసింది. గ్రూప్‌ దశలో ఎక్కువ విజయాలు సాధించిన జట్లు సూపర్‌ సిక్స్‌ స్టేజ్‌కు అర్హత సాధిస్తాయి. అనంతరం సెమీస్‌ బెర్తు కోసం రెండు గ్రూప్‌ల్లోని ఆరు జట్లు పోటీపడతాయి.

టైటిల్‌ నెగ్గిన జట్లు:

ఆస్ట్రేలియా(1988, 2002, 2010),

ఇండియా(2000, 2008, 2012, 2018, 2022),

పాకిస్తాన్‌(2004, 2006),

ఇంగ్లండ్‌(1998),

దక్షిణాఫ్రికా(2014),

వెస్టిండీస్‌(2016),

బంగ్లాదేశ్‌(2020)

గ్రూప్‌-ఎ : భారత్‌, బంగ్లాదేశ్‌, ఐర్లాండ్‌,అమెరికా

గ్రూప్‌-బి : ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, స్కాట్లాండ్‌..

గ్రూప్‌-సి : ఆస్ట్రేలియా, శ్రీలంక, నమీబియా, జింబాబ్వే

గ్రూప్‌-డి : అఫ్గనిస్థాన్‌, పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌, నేపాల్‌

భారతజట్టు: ఉదయ్ శంకర్‌(కెప్టెన్‌), సౌమీకుమార్‌ పాండే(వైస్‌ కెప్టెన్‌), అవనీశ్‌ రావు, ఇన్నేశ్‌ మహాజన్‌(వికెట్‌ కీపర్లు), అర్షిన్‌ కులకర్ణి, ఆదర్శ్‌ సింగ్‌, రుద్ర మయుర్‌ పాటిల్‌, సచిన్‌ ధాస్‌, ప్రియాన్షు మోలియా, ముషీర్‌ ఖాన్‌, మురుగన్‌ అభిషేక్‌, ధనుష్‌ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్‌ లింబని, నమన్‌ తివారిబ్యాకప్‌

ప్లేయర్స్‌: దిగ్విజరు పాటిల్‌, జయంత్‌ గోయట్‌, విఘ్నేశ్‌, కిరణ్‌ ఛోర్మలే.

➡️