రన్నరప్‌ మహిళల ఫుట్‌బాల్‌ జట్టు

Feb 27,2024 22:25 #Sports

ఫైనల్లో పోరాడి ఓడిన భారత్‌

అంకారా(టర్కీ): టర్కిస్‌ మహిళల ఫుట్‌బాల్‌ టోర్నీ రన్నరప్‌గా భారత మహిళలజట్టు నిలిచింది. మంగళవారం జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌.. తనకంటే ర్యాంకుల్లో చిన్నదేశమైన కొసావో చేతిలో 1-3గోల్స్‌ తేడాతో ఓటమిపాలైంది. తొలి మ్యాచ్‌లో యూరోపియన్‌ జట్టు స్లొవేనియాపై 1-0తో సంచలన విజయం సాధించిన భారత మహిళలజట్టు ఫైనల్లో ఆ ప్రతిభను కనబర్చులేకపోయింది. టోర్నమెంట్‌లో ఆడిన మూడు మ్యాచుల్లో భారత మహిళల జట్టు అత్యుత్తమ ప్రదర్శన ఇదే. కొసావోతో మ్యాచ్‌కు ముందు భారత్‌ ఈ మ్యాచ్‌ను డ్రా చేసుకొన్నా విజేతగా నిలిచే అవకాశముంది. కానీ చివరి లీగ్‌ ఫైనల్లో భారత్‌ ఓటమితో టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచి రన్నరప్‌తో సరిపుచ్చుకుంది.

➡️