రాజస్తాన్‌ను ఫైనల్‌కు చేర్చిన దీపక్‌ హుడా

Dec 14,2023 22:30 #Sports

-సెమీస్‌లో కర్ణాటకపై ఏడు వికెట్ల తేడాతో గెలుపు

-విజయ్ హజారే వన్డే టోర్నీ

రాజ్‌కోట్‌: కెప్టెన్‌ దీపక్‌ హుడా(180) భారీ శతకానికి తోడు కరణ్‌ లాంబ(73నాటౌట్‌) అర్ధసెంచరీతో రాణంచడంతో రాజస్తాన్‌ జట్టు తొలిసారి విజరుహజారే వన్డే టోర్నీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సౌరాష్ట్ర స్టేడియంలో గురువారం జరిగిన రెండో సెమీస్‌లో కర్ణాటక నిర్దేశించిన 283పరుగుల లక్ష్యాన్ని రాజస్తాన్‌ జట్టు 43.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 282పరుగులు చేసింది. టాప్‌ఆర్డర్‌ బ్యాటర్స్‌ సమర్థ్‌(8), కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌(13), నికిన్‌ జోస్‌(21), వికెట్‌ కీపర్‌ కృష్ణన్‌(37) నిరాశపరిచారు. కర్ణాటక జట్టు 87పరుగులకే 4వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో అభినవ్‌ మనోహర్‌(91), మనోజ్‌(63) అర్ధసెంచరీలతో కదం తొక్కారు. అంకిత్‌ చౌదరి, అజరు సింగ్‌కు రెండేసి, ఖలీల్‌ అహ్మద్‌, అరాఫత్‌ ఖాన్‌, రాహుల్‌ చాహర్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. ఛేదనలో రాజస్తాన్‌ ఓపెనర్లు అభిజిత్‌ థోమర్‌(0), మోహన్‌ చౌహాన్‌(0) డకౌట్లయినా.. కెప్టెన్‌ దీపక్‌ హుడా స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్‌కి తోడు కరన్‌ లాంబా అర్ధసెంచరీతో కదం తొక్కారు. వీరిద్దరూ కలిసి 4వ వికెట్‌కు ఏకంగా 255పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కర్ణాటక బౌలర్లు కౌశిక్‌, వ్యాషక్‌, మనోజ్‌లకు ఒక్కో వికెట్‌ దక్కాయి. శనివారం జరిగే ఫైనల్లో రాజస్తాన్‌ జట్టు టైటిల్‌కై హర్యానా జట్టుతో తలపడనుంది.

➡️