రెండోరౌండ్‌కు లక్ష్యసేన్‌

Mar 6,2024 22:30 #Sports

ఫ్రెంచ్‌ ఓపెన్‌ సూపర్‌750

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ సూపర్‌ా750 బ్యాడ్మింటన్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో యువ షట్లర్‌ లక్ష్యసేన్‌ శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన తొలిరౌండ్‌ పోటీలో లక్ష్యసేన్‌ మూడుసెట్ల హోరాహోరీ పోరులో లక్ష్యసేన్‌ 15-21, 21-15. 21-3 తేడాతో జపాన్‌ ఆటగాడు కాంత సునేయమను చిత్తు చేశాడు. అయితే, ఈ మ్యాచ్‌లో లక్ష్యసేన్‌కు తొలి గేమ్‌లో ప్రత్యర్థి షాకిచ్చాడు. 8-5తో ఆధిక్యంలోకి కొనసాగిన లక్ష్యసేన్‌ ఆ తర్వాత పట్టు కోల్పోయి గేమ్‌ను చేజార్చుకున్నాడు. తొలి గేమ్‌ తర్వాత లక్ష్యసేన్‌ అద్భుతంగా పుంజుకున్నాడు. వరుసగా రెండు గేమ్‌లను ఏకపక్షంగా గెలుచుకున్నాడు. లక్ష్యసేన్‌ జోరు ముందు ప్రత్యర్థి నిలువలేకపోయాడు. మరోవైపు, యువ ఆటగాడు ప్రియాన్ష్‌ రజావత్‌ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు. టాప్‌ సీడ్‌, డెన్మార్క్‌ స్టార్‌ విక్టర్‌ అక్సెల్సెన్‌ చేతిలో 21-8, 21-15 తేడాతో పరాజయం పాలయ్యాడు. ఇక పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌-చిరాగ్‌, మహిళల డబుల్స్‌లో ట్రీసా జోలీ-గాయత్రి గోపీచంద్‌ జంట రెండోరౌండ్‌లోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే.

➡️