రెండో టి20లోనూ విండీస్‌ గెలుపు

Dec 15,2023 22:30 #Sports

గ్రెనెడా(సెయింట్‌జార్జెస్‌): ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టి20లోనూ వెస్టిండీస్‌ జట్టు విజయం సాధించింది. వెస్టిండీస్‌ నిర్దేశించిన 177పరుగుల లక్ష్యాన్ని ఛేధించే క్రమంలో ఇంగ్లండ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 7వికెట్ల నష్టానికి 166పరుగులే చేయగల్గింది. దీంతో విండీస్‌ జట్టు 10పరుగులు తేడాతో నెగ్గి ఐదు టి20ల సిరీస్‌లో 2ా0 ఆధిక్యతలో నిలిచింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ను ఓపెనర్‌ కింగ్‌(82; 52బంతుల్లో 8ఫోర్లు, 5సిక్సర్లు), రువన్‌ పావెల్‌(50; 28బంతుల్లో 3ఫోర్లు, 5సిక్సర్లు) అర్ధసెంచరీలతో రాణించారు. రషీద్‌, మిల్స్‌కు రెండేసి, వోక్స్‌, సామ్‌ కర్రన్‌, రెహాన్‌ అహ్మద్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్‌ ఓపెనర్‌, కెప్టెన్‌ బట్లర్‌(5) నిరాశపరిచినా.. సామ్‌ కర్రన్‌(50; 32బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సర్లు) అర్ధసెంచరీతో ఆదుకున్నాడు. జోసెఫ్‌కు మూడు, హొసైన్‌కు రెండు వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ కింగ్‌కు లభించగా.. మూడో టి20 ఆదివారం జరగనుంది.

➡️