రైబకినా, పెగూలా ఔట్‌..

Jan 18,2024 22:10 #Sports

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో సంచలనాలు నమోదయ్యాయి. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ రెండోరౌండ్‌ పోటీలో టైటిల్‌ ఫేవరెట్‌, 2వ సీడ్‌, కజకిస్తాన్‌కు చెందిన రైబకినాకి తోడు 5వ సీడ్‌ పెగూలా(అమెరికా) అనూహ్యంగా అన్‌సీడెడ్‌ క్రీడాకారిణుల చేతిలో ఓడారు. హోరాహోరాగా సాగిన రెండోరౌండ్‌ పోటీలో రైబకినా 4-6, 6-4, 6-7(20-22)తో బ్లింకోవా(రష్యా) చేతిలో పరాజయాన్ని చవిచూడగా.. పెగూలా 4-6, 2-6తో బరెల్‌(ఫ్రాన్స్‌) చేతిలో ఓటమిపాలైంది. మరో పోటీలో 19వ సీడ్‌ స్విటోలినా(ఉక్రెయిన్‌) 6-1, 6-3తో టోమోవా(బల్గేరియా)ను చిత్తుచేయగా.. మూడోరౌండ్‌కు అల్కరాజ్‌.. పురుషుల సింగిల్స్‌లో టైటిల్‌ ఫేవరెట్‌, 2వ సీడ్‌, స్పెయిన్‌ యువ సంచలనం కార్లోస్‌ అల్కరాజ్‌ మూడోరౌండ్‌కు చేరాడు. గురువారం జరిగిన రెండోరౌండ్‌ పోటీలో అల్కరాజ్‌ 6-4, 6-7(3-7), 6-3, 7-6(7-3)తో లెరెంటో సొనేగో(ఇటలీ)పై గెలిచాడు. ఇక 13వ సీడ్‌ డిమిట్రోవ్‌(బల్గేరియా) 6-3, 6-2, 4-6, 6-4తో కొక్కినకీస్‌(ఆస్ట్రేలియా), 21వ సీడ్‌ హోబర్ట్‌(ఫ్రాన్స్‌) 6-2, 5-7, 6-1, 7-6(7-3)తో జెడి జంగ్‌(చైనా)ను చిత్తుచేశారు. మరో పోటీలో 8వ సీడ్‌ రూనే(డెన్కార్మ్‌) అనూహ్యంగా రెండోరౌండ్‌లోనే నిష్క్రమించాడు. రెండోరౌండ్‌లో రూనే 6-7(4-7), 4-6, 4-6, 3-6తో అన్‌సీడెడ్‌ ఆర్ధర్‌(ఫ్రాన్స్‌) చేతిలో ఓడాడు. ఇక 9వ హెచ్‌. హుర్కాజ్‌ 6-7(9-11), 6-1, 5-7, 6-1, 6-3తో మెన్సిక్‌(చెక్‌)పై విజయం సాధించాడు. రెండోరౌండ్‌లో నాగల్‌ ఓటమి, బోపన్న జోడీ ముందంజపురుషుల సింగిల్స్‌ రెండోరౌండ్‌ పోటీలో భారత సంచలనం సుమిత్‌ నాగల్‌ పోరాటం ముగిసింది. తొలిరౌండ్‌లో 31వ ర్యాంకర్‌కు ఝలక్‌ ఇచ్చి రెండోరౌండ్‌కు చేరిన నాగల్‌.. గురువారం రెండోరౌండ్‌ పోటీలో తొలుత ఒక సెట్‌ను చేజిక్కించుకొని ఆశలు రేపినా.. ఆ తర్వాత వరుసగా మూడు సెట్లను కోల్పోయి మ్యాచ్‌ను చేజార్చుకున్నాడు. రెండోరౌండ్‌లో సుమిత్‌ 2-6, 3-6, 5-7, 4-6తో చైనాకు చెందిన జె.సి. షాంగ్‌ చేతిలో ఓడాడు. ఇక పురుషుల డబుల్స్‌లో రోహన్‌ బోపన్నామాథ్యూ ఎబ్డెన్‌ జోడీ రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. హోరాహోరీగా సాగిన తొలిరౌండ్‌ పోటీలో 7-6(7-5), 4-6, 7-6(7-2)తో ఆస్ట్రేలియా డబుల్స్‌ జంట డక్‌వర్త్‌, మార్క్‌ పోల్కన్స్‌లను చిత్తుచేశారు. మరో పోటీలో భారత్‌ అనిరుద్‌ చంద్రశేఖర్‌ావిజరు సుందర్‌ జంట 3-6, 4-6తో ఫ్రాన్స్‌ జంట చేతిలో పరాజయాన్ని చవిచూశారు.

➡️