వచ్చే ఐపిఎల్‌ సీజన్‌కు హార్దిక్‌ దూరం?

Dec 23,2023 22:10 #Sports

ముంబయి: 2024 ఐపిఎల్‌ సీజన్‌కూ ముంబయి కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య దూరమయ్యాడు. రోహిత్‌ శర్మ స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలను ముంబయి ఫ్రాంచైజీ హార్దిక్‌ పాండ్యకు అప్పగించింది. గుజరాత్‌ టైటాన్స్‌ సారథిగా ఉన్న అతడిని తీసుకొచ్చి మరీ కెప్టెన్‌ అంటూ ప్రకటించేసింది. వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో హార్దిక్‌ పాండ్య ఆడకపోవచ్చని సమాచారం. ఐసిసి వన్డే ప్రపంచ కప్‌లో గాయపడిన పాండ్య స్వదేశంలో ఆస్ట్రేలియాతో టి20 సిరీస్‌తోపాటు దక్షిణాఫ్రికా పర్యటనకూ దూరమయ్యాడు. కనీసం అఫ్గాన్‌తో టి20 సిరీస్‌కైనా జట్టులోకి వస్తాడని భావించినా ప్రయోజనం లేకపోయింది. గాయం తీవ్రత కారణంగా ఆఫ్ఘన్‌ సిరీస్‌తోపాటు 2024 ఐపిఎల్‌లోనూ ఆడటం కష్టమేనని తెలిసింది. వచ్చే ఏడాది టి20 ప్రపంచకప్‌ ఉన్న దృష్ట్యా అతడి విషయంలో ఎలాంటి రిస్క్‌ తీసుకోవడానికి బిసిసిఐ ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఐపిఎల్‌లో పాండ్య గైర్హాజరుపై ముంబయి ఇండియన్స్‌ ఫ్రాంచైజీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువరించలేదు.

➡️