వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఆసీస్‌ చేతిలో భారత్‌ ఓటమి

Feb 12,2024 07:35 #Sports

అండర్‌ 19 వరల్డ్‌కప్‌ 2024 ఫైనల్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. యంగ్‌ ఇండియాతో ఆదివారం జరిగిన ఫైనల్లో యువ ఆసీస్‌ జట్టు 79 పరుగుల తేడాతో విజయం సాధించి, నాలుగో సారి జగజ్జేతగా నిలిచింది.

ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. భారత సంతతికి చెందిన హర్జస్‌ సింగ్‌ (55) అర్దసెంచరీతో రాణించగా.. హ్యారీ డిక్సన్‌ (42), హగ్‌ వెబ్జెన్‌ (48), ఒలివర్‌ పీక్‌ (46 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో రాజ్‌ లింబాని 3, నమన్‌ తివారి 2, సౌమీ పాండే, ముషీర్‌ ఖాన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన యువ భారత్‌.. 43.5 ఓవర్లలో 174 పరుగులకు కుప్పకూలి వంద కోట్లకు పైగా ఉన్న భారతీయులకు నిరాశ కలిగించింది. భారత ఇన్నింగ్స్‌లో ఆదర్శ్‌ సింగ్‌ (47), తెలుగు ఆటగాడు మురుగన్‌ అభిషేక్‌ (42), ముషీర్‌ ఖాన్‌ (22), నమన్‌ తివారి (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్‌ బౌలర్లు బియర్డ్‌మ్యాన్‌ (3/15), రాఫ్‌ మెక్‌మిలన్‌ (3/43), కల్లమ్‌ విడ్లర్‌ (2/35), ఆండర్సన్‌ (1/42) టీమిండియా పతనాన్ని శాశించారు.

➡️