సమీస్‌కు ప్రణయ్

Jan 19,2024 22:16 #Sports

ఇండియా ఓపెన్‌ సూపర్‌750

న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్‌ సూపర్‌750 పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లోకి హెచ్‌ఎస్‌ ప్రణరు రారు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో 8వ సీడ్‌ హెచ్‌ఎస్‌ ప్రణరు 21-11, 17-21, 21-18తో వాంగ్‌-జుావుయ్(చైనీస్‌ తైపీ)ను చిత్తుచేశాడు. తొలి గేమ్‌ను సునాయాసంగా నెగ్గిన ప్రణయ్.. రెండో గేమ్‌లో ఓ దశలో 15-17తో వాంగ్‌కు చేరువయ్యాడు. కానీ వాంగ్‌ తర్వాత పుంజుకొని ఆ గేమ్‌ను చేసుకున్నాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లోనూ వాంగ్‌-ప్రణయ్ ల మధ్య హోరాహోరీగా సాగింది. ఈ గెలుపులో ముఖాముఖి పోరులో ప్రణయ్ 5-3 ఆధిక్యతలో నిలిచాడు. శనివారం జరిగే సెమీస్‌లో ప్రణయ్ 6వ సీడ్‌ చైనాకు చెందిన షిాయుాక్యూతో తలపడనున్నాడు. మరో సెమీస్‌ 2వ సీడ్‌ నరోకా(జపాన్‌), లీ-ఛౌ-యు(కెనడా)ల మధ్య జరగనుంది. ఇక డబుల్స్‌లో టాప్‌సీడ్‌ చిరాగ్‌శెట్టి-సాత్విక్‌సాయిరాజ్‌ రంకిరెడ్డి 5వ సీడ్‌ డెన్మార్క్‌ జంటతో తలపడనుంది.

➡️