సహరన్‌, సచిన్‌ సెంచరీలు

Feb 2,2024 22:20 #Sports

సెమీస్‌కు భారత యువజట్టు

జహన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్‌-19 ప్రపంచకప్‌లో భారత యువ జట్టు మరోసారి భారీస్కోర్‌ను నమోదు చేసింది. బ్లూంఫోంటీన్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకొని నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 297 పరుగులు చేసింది. భారత్‌ ఇన్నింగ్స్‌లో ఇద్దరు బ్యాటర్లు సెంచరీలు చేయడం విశేషం. సచిన్‌ దాస్‌కి తోడు కెప్టెన్‌ ఉదరు సహారన్‌ సెంచరీలతో అదరగొట్టారు. సచిన్‌ దాస్‌ 101 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 116 పరుగులు చేయగా… ఉదరు సహారన్‌ 107బంతుల్లో 9ఫోర్లతో 100 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆదర్శ్‌ సింగ్‌ 21, అర్షిన్‌ కులకర్ణి 18, ప్రియాన్షు మోలియా 19 పరుగులు చేశారు. నేపాల్‌ బౌలర్లలో గుల్షన్‌ ఝాకు మూడు, ఆకాశ్‌ చంద్‌కు ఒక వికెట్‌ దక్కాయి.

స్కోర్‌బోర్డు..

ఇండియా(అండర్‌19)

ఇన్నింగ్స్‌: ఆదర్ష్‌ సింగ్‌ (సి)ఉత్తమ్‌ (బి)గుల్సన్‌ 21, అర్షిన్‌ కులకర్ణి (సి)ఉత్తమ్‌ (బి)ఆకాశ్‌ 18, ప్రియాన్షు మోలియా (రనౌట్‌) దీపక్‌/ఆకాశ్‌ 19, ఉదరు సహరన్‌ (సి)శుభాష్‌ (బి)గుల్సన్‌ 100, సచిన్‌ ధాస్‌ (సి)దీపక్‌ (బి)గుల్సన్‌ 116, ముషీర్‌ ఖాన్‌ (నాటౌట్‌) 9, అవనీశ్‌ (నాటౌట్‌) 0, అదనం 14. (50 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి) 297పరుగులు.

వికెట్ల పతనం: 1/26, 2/61, 3/62, 4/277, 5/295

బౌలింగ్‌: గుల్సన్‌ 10-0-56-3, దుర్గేశ్‌ గుప్తా 9-2-55-0, దీపేశ్‌ 10-0-46-0, ఆకాశ్‌ చంద్‌ 9-0-65-1, శుభాష్‌ భండారి 10-0-55-0, దేశ్‌ ఖనల్‌ 2-0-14-0

➡️