33బంతుల్లోనే సెంచరీ

Feb 27,2024 22:20 #Sports

టి20ల్లో నమీబియా బ్యాటర్‌ రికార్డు

దుబాయ్: మైల్‌స్టోన్‌ టి20 ఇంటర్నేషనల్‌ టోర్నమెంట్‌లో నమీబియా బ్యాటర్‌ జాన్‌ నికోల్‌ లాఫ్టీ-ఈటన్‌ కేవలం 33బంతుల్లోనే సెంచరీ కొట్టి రికార్డు పుటల్లోకెట్టాడు. మంగళవారం నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈటన్‌ కేవలం 33బంతుల్లో 11ఫోర్లు, 8 భారీ సిక్సర్ల సాయంతో సెంచరీని పూర్తి చేశాడు. దీంతో 2023లో నేపాల్‌ బ్యాటర్‌ కుషాల్‌ మొల్లా(34బంతుల్లో సెంచరీ) రికార్డును బ్రేక్‌ చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన నమీబియా జట్టు 11 ఓవర్లలో 3వికెట్ల నష్టానికి 62పరుగులు చేసి కష్టాల్లో ఉన్న దశలో క్రీజ్‌లోకి వచ్చిన నికోల్‌ 36బంతుల్లో 101పరుగులు కొట్ట ఆ జట్టు భారీస్కోర్‌కు దోహదపడ్డాడు. దీంతో నమీబియా జట్టు 20 ఓవర్లలో 206పరుగులు చేసింది. ఛేదనలో నేపాల్‌ జట్టు 18.5ఓవర్లలో 186పరుగులకు కుప్పకూలింది. దీంతో నమీబియా జట్టు 20 పరుగుల తేడాతో గెలిచింది.

టి20ల్లో వేగంగా సెంచరీ కొట్టిన బ్యాటర్లు..

33 : జాన్‌ నికోల్‌ లోఫ్టీ ఈటన్‌(నమీబియా);నేపాల్‌పై 2024

34 : కుశాల్‌ మల్లా(నేపాల్‌); మంగోలియాపై 2023

35 : డేవిడ్‌ మిల్లర్‌(దక్షిణాఫ్రికా); బంగ్లాదేశ్‌పౖాె2017

35 : రోహిత్‌ శర్మ(ఇండియా); శ్రీలంకపౖాె2017

35 : సుదేశ్‌ విక్రమశేఖర(చెక్‌ రిపబ్లిక్‌); టర్కీపౖాె2019

➡️