అర్జున్‌కు 4వ ర్యాంక్‌

Jun 3,2024 21:44 #chess, #Sports
  • టాప్‌-10లో గుకేశ్‌, ప్రజ్ఞానందకు చోటు
  • ఫిడే ర్యాంకింగ్స్‌ విడుదల

లాసన్నె: ఫిడే చెస్‌ ర్యాంకింగ్స్‌లో భారత గ్రాండ్‌మాస్టర్లు సత్తా చాటారు. అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య(ఫిడే) సోమవారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో ఏకంగా నలుగురు గ్రాండ్‌ మాస్టర్లు టాప్‌-10లో చోటు దక్కించుకున్నారు. ఎరిగాసి అర్జున్‌ 2771.2 రేటింగ్‌ పాయింట్లలో ఏకంగా టాప్‌-4లో నిలిచాడు. ఇటీవల ముగిసిన ఫ్రెంచ్‌ ఛాంపియన్‌షిప్‌గా నిలవడంతో అర్జున్‌ ఏకంగా 14స్థానాలు మెరుగుపరుచుకొని టాప్‌-4లో నిలిచాడు. ఇక టాప్‌లో మాగస్‌ కార్ల్‌సన్‌(నార్వే) ఉండగా.. అమెరికాకు చెందిన హికారు నకమురా, ఫాబినో కరునా టాప్‌-3లో ఉన్నారు. కార్ల్‌సన్‌ 2830.9పాయింట్లతో ఫిడే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక దొమ్మరాజు గుకేశ్‌(2763) 7వ స్థానంలో నిలువగా.. ఆర్‌. ప్రజ్ఞానంద(2755) 10వ ర్యాంక్‌లో ఉన్నాడు. విశ్వనాథన్‌ ఆనంద్‌(2751) 11వ స్థానంలో కొనసాగుతున్నారు. ఇక 14ఏళ్ల అర్జున్‌ ఎరిగాసి భారత్‌ నుంచి గ్రాండ్‌మాస్టర్‌ హోదా సాధించిన 52వ ఆటగాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో గ్రాండ్‌మాస్టర్‌ హోదా సాధించి భారత్‌ తరఫున విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత 4వ ర్యాంక్‌లో నిలిచిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు.

➡️