పారిస్‌ ఒలింపిక్స్‌కు 4×400మీ. రిలే జట్లు అర్హత

May 6,2024 23:01 #2024, #Paris Olympics, #Sports

బహమాస్‌: పారిస్‌ ఒలింపిక్స్‌కు అథ్లెటిక్స్‌ విభాగంలో మరో భారత్‌కు మరో రెండు బెర్త్‌లు దక్కాయి. బహమాస్‌లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్‌ రిలే ఈవెంట్‌ 4×400మీ. రిలేలో భారత మహిళల, పురుషుల జట్లు పారిస్‌కు అర్హత సాధించాయి. మహిళ విభాగంలో రూపల్‌ చౌదరీ, ఎంఆర్‌ పూవమ్మ, జ్యోతికా శ్రీదండి, సుభా వెంకటేశన్‌లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. హీట్‌ నెంబర్‌-9లో భారత మహిళల బృందం 3 నిమిషాల 29.35 సెకన్లలో రేస్‌ను పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచారు. ఆ రేసులో జమైకా బృందం తొలి స్థానంలో నిలిచింది. పురుషుల విభాగంలో మహమ్మద్‌ అనాస్‌ యహియా, మొహమ్మద్‌ అజ్మల్‌, అరోకియా రాజీవ్‌, అమోజ్‌ జాకబ్‌ బృందం 4×400మీ. రిలే బృందం 3నిమిషాల 3.23 సెకన్లలో పూర్తి చేశారు. తమ హీట్‌లో ఈ బృందం రెండో స్థానంలో నిలిచింది. అమెరికా తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. అనాస్‌, అజ్మల్‌, అమోజ్‌లు కేరళవాసులు కాగా, రాజీవ్‌ తమిళనాడుకు చెందిన అథ్లెట్‌. రెండవ రౌండ్‌కు చెందిన మూడు హీట్స్‌లో టాప్‌ టూలో ఉండే బృందాలను ఒలింపిక్స్‌కు ఎంపిక చేస్తారు. జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు పారిస్‌ ఒలింపిక్స్‌ క్రీడలు జరగనున్నాయి.

➡️