ముంబయికి ఆధిక్యత

Mar 11,2024 21:12 #Cricket, #Ranji Trophy, #Sports
  • విదర్భతో రంజీట్రోఫీ ఫైనల్‌

ముంబయి: రంజీట్రోఫీ ఫైనల్లో ముంబయి జట్టుకు భారీ ఆధిక్యత లభించింది. తొలి ఇన్నింగ్స్‌లో ముంబయి 224పరుగులకు ఆలౌటైనా.. సోమవారం విదర్భను తొలి ఇన్నింగ్స్‌లోకేవలం 105పరుగులకే ఆలౌట్‌ చేసింది. దీంతో ముంబయికి 132పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యత లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ముంబయి జట్టు రెండోరోజు ఆట ముగిసే సమయానికి 2వికెట్ల నష్టానికి 141పరుగులు చేసింది. మూడు వికెట్ల నష్టానికి 31పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన విదర్భను 105 పరుగులకే ఆలౌట్‌ చేసింది. ఆ జట్టులో యశ్‌ రాఠోడ్‌ (27) టాప్‌ స్కోరర్‌గా కాగా.. అథర్వ తైడే (23), ఆదిత్య థాక్రే (19), యశ్‌ ఠాకూర్‌ (16) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. కెరీర్‌లో చివరి ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ ఆడుతున్న పేసర్‌ ధవళ్‌ కులకర్ణి (3/15) అదరగొట్టాడు. తనుష్‌ కొటియన్‌ (3/7), శామ్స్‌ ములాని (3/32) బౌలింగ్‌లో విజృంభించారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 119 పరుగుల ఆధిక్యం సంపాదించిన ముంబయి జట్టు.. రెండోరోజు ఆట ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. ప్రస్తుతం 260 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఓపెనర్లు పృథ్వీ షా(11), భూపేన్‌ లాల్వానీ(18) తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు. ముంబయి 34 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న దశలో ముషీర్‌ ఖాన్‌ (51నాటౌట్‌; 135బంతుల్లో 3ఫోర్లు), కెప్టెన్‌ అజింక్య రహానె (58నాటౌట్‌; 109బంతుల్లో 4ఫోర్లు, సిక్సర్‌) అర్ధ శతకాలతో ఆదుకున్నారు.

➡️