పేసర్ల స్వర్గధామం

Jan 3,2024 22:30 #Sports

-సిరాజ్‌కు ఆరు

దక్షిణాఫ్రికా 55ఆలౌట్‌,

భారత్‌ 156ఆలౌట్‌

భారత్‌కు 101పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యత

కేప్‌టౌన్‌: రెండో, చివరి టెస్ట్‌లో హైదరాబాద్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ నిప్పులు చెరిగే బంతులకు తోడు బుమ్రా, ముఖేశ్‌కుమార్‌ బౌలింగ్‌లో చెలరేగడంతో దక్షిణాఫ్రికా తొలిరోజు లంచ్‌ విరామానికే ఆలౌటయ్యింది. అనంతరం టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 156పరుగులకే ఆలౌట్‌ కావడంతో భారత్‌కు 101 పరుగుల ఆధిక్యత లభించింది. పేసర్లకు స్వర్గధామమైన కేప్‌టౌన్‌లో బుధవారం నుంచి ప్రారంభమైన రెండో టెస్ట్‌లో టీమిండియా పేసర్ల ధాటికి దక్షిణాఫ్రికా 23.2 ఓవర్లలో 55పరుగులకే ఆలౌటయ్యింది. దీంతో దక్షిణాఫ్రికాకు అత్యల్ప స్కోరు 73పరుగుల రికార్డును ఉంది. అంతకుముందు 2016లో జోహన్నెస్‌బర్గ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సఫారీలు 83 పరుగులకు ఆలౌటైంది. దక్షిణాఫ్రికా 1992లో తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లో పునరాగమనం చేసిన తర్వాత ఆ జట్టుకు టెస్టుల్లో ఇదే అత్యల్ప స్కోర్‌. సిరాజ్‌ కెరీర్‌ బెస్ట్‌..దక్షిణాఫ్రికాపై సిరాజ్‌ ఆరు వికెట్లు తీసి మూడో అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శనను నమోదు చేశాడు. అంతకుముందు 2022లో శార్దూల్‌ ఠాకూర్‌.. జోహన్నస్‌బర్గ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్లు పడగొట్టాడు. 2011లో హర్భజన్‌ సింగ్‌ కూడా.. కేప్‌టౌన్‌లో ఏడు వికెట్లు తీశాడు. మూడో స్థానంలో సిరాజ్‌ (15/6) ఉన్నాడు. ఈ క్రమంలో సిరాజ్‌.. కుంబ్లే (53/6), శ్రీనాథ్‌ (76/6)ల సరసన చేరాడు. కేప్‌టౌన్‌లో భారత బౌలర్లలో హర్భజన్‌సింగ్‌ తర్వాత సిరాజ్‌దే రెండో అత్యుత్తమ ప్రదర్శన.టెస్ట్‌ క్రికెట్‌లో తొలిసారి.. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో టీమిండియా ఓ చెత్త రికార్డును తన పేర లిఖించుకుంది. 153పరుగుల వద్ద ఆరు వికెట్లు కోల్పోయి ఈ రికార్డును మూటగట్టుకుంది. దక్షిణాఫ్రికాను తొలి ఇన్నింగ్స్‌లో 55పరుగులకు ఆలౌట్‌ చేసిన టీమిండియా.. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆడుతూ 153పరుగులకు 4వికెట్లు కోల్పోయి పటిష్టంగా కనబడింది. ఆ దశలో రబడా, ఎన్గిడి, బర్గర్‌ చెలరేగడంతో 153పరుగులకే ఆలౌటైంది. అలాగే భారత బ్యాటర్లు ఆరుగురు డకౌటయ్యారు. జైస్వాల్‌, శ్రేయస్‌, జడేజా, బుమ్రా, సిరాజ్‌, ప్రసిధ్‌ పరుగుల ఖాతా తెరవకుండానే పెవీలియన్‌కు చేరారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ను కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(39), కోహ్లి(46) ఆదుకున్నారు. శుభ్‌మన్‌(38) కూడా బ్యాటింగ్‌లో రాణించగా.. ఆరుగురు బ్యాటర్లు డకౌటయ్యారు. వీరు ముగ్గురు కలిపి 123పరుగులు చేయగా.. అదనంగా 24పరుగులు వచ్చాయి. కెఎల్‌ రాహుల్‌(8) పరుగులు చేయగా.. మిగిలిన బ్యాటర్లందరూ డకౌట్లయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లు రబడా, ఎన్గిడి, బర్గర్‌ మూడేసి వికెట్లు పడగొట్టగా.. సిరాజ్‌ రనౌటయ్యాడు.

స్కోర్‌బోర్డు..

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: మార్‌క్రమ్‌ (సి)జైస్వాల్‌ (బి)సిరాజ్‌ 2, ఎల్గర్‌ (బి)సిరాజ్‌ 4, జోర్జి (సి)రాహుల్‌ (బి)సిరాజ్‌ 2, స్టబ్స్‌ (సి)రోహిత్‌ (బి)బుమ్రా 3, బెడింగ్హామ్‌ (సి)జైస్వాల్‌ (బి)సిరాజ్‌ 12, వెర్రెయనె (సి)శుభ్‌మన్‌ (బి)సిరాజ్‌ 15, జెన్సన్‌ (సి)రాహుల్‌ (బి)సిరాజ్‌ 0, మహరాజ్‌ (సి)బుమ్రా (బి)ముఖేశ్‌ కుమార్‌ 3, రబడా (సి)శ్రేయస్‌ (బి)ముఖేశ్‌ కుమార్‌ 5, బర్గర్‌ (సి)జైస్వాల్‌ (బి)బుమ్రా 4, ఎన్గిడి (నాటౌట్‌) 0, అదనం 5. (23.2 ఓవర్లలో ఆలౌట్‌) 55పరుగులు.

వికెట్ల పతనం: 1/5, 2/8, 3/11, 4/15, 5/34, 6/34, 7/45, 8/46, 9/55, 10/55

బౌలింగ్‌: బుమ్రా 8-1-25-2, సిరాజ్‌ 9-3-15-6, ప్రసిధ్‌ 4-1-10-0, ముఖేశ్‌ కుమార్‌ 2.2-2-0-2.

ఇండియా తొలి ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (బి)రబడా 0, రోహిత్‌ (సి)జెన్సన్‌ (బి)బర్గర్‌ 39, శుభ్‌మన్‌ (సి)జెన్సన్‌ (బి)బర్గర్‌ 38, కోహ్లి (సి)మార్‌క్రమ్‌ (బి)రబడా 46, శ్రేయస్‌ (సి)వెర్రెయనె (బి)బర్గర్‌ 0, కెఎల్‌ రాహుల్‌ (సి)వెర్రెయనె (బి)ఎన్గిడి 8, జడేజా (సి)జెమీసన్‌ (బి)ఎన్గిడి 0, బుమ్రా (సి)జెన్సన్‌ (బి)ఎన్గిడి 0, సిరాజ్‌ (రనౌట్‌) బర్గర్‌ 0, ప్రసిధ్‌ (సి)మార్‌క్రమ్‌ (బి)రబడా 0, ముఖేశ్‌ కుమార్‌ (నాటౌట్‌) 0, అదనం 24. (34.5ఓవర్లలో ఆలౌట్‌) 153పరుగులు.

వికెట్ల పతనం: 1/17, 2/72, 3/105, 4/110, 5/110, 5/153, 6/153, 7/153, 8/153, 9/153, 10/153

బౌలింగ్‌: రబడా 11.5-2-38-3, ఎన్గిడి 6-1-39-3, బర్గర్‌ 8-2-42-3, జెన్సన్‌ 9-2-29-0

దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌: మార్‌క్రమ్‌ఎల్గర్‌ (సి)కోహ్లి (బి)ముఖేశ్‌ కుమార్‌ 12, జోర్జి (సి)రాహుల్‌ (బి)ముఖేశ్‌ కుమార్‌ 1, స్టబ్స్‌

వికెట్ల పతనం: 1/37, 2/41

➡️