రాజస్తాన్‌కు షాక్‌

Apr 11,2024 00:44 #Cricket, #ipl 2024, #Sports
  • గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో అనూహ్య ఓటమి
  • ధనాధన్‌ బ్యాటింగ్‌తో చెలరేగిన రషీద్‌ఖాన్‌

జైపూర్‌: ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) సీజన్‌-17లో రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు తొలి ఓటమిని చవిచూసింది. ఈ సీజన్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తోన్న రాజస్తాన్‌కు గుజరాత్‌ బ్రేక్‌ వేసింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3వికెట్ల నష్టానికి 196పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేయగా.. ఆ లక్ష్యాన్ని గుజరాత్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 199పరుగులు చేసి సంచలన విజయం సాధించింది. గుజరాత్‌ గెలుపులో ఆల్‌రౌండర్‌ రషీద్‌ ఖాన్‌ కీలకపాత్ర పోషించాడు. చివరి 4 ఓవర్లలో 60 పరుగులు చేయాల్సిన దశలో గుజరాత్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌(72), తెవాటియా(14; 8బంతుల్లో ఫోర్‌, సిక్సర్‌), రషీద్‌ ఖాన్‌(24నాటౌట్‌; 11బంతుల్లో 4ఫోర్లు) కీలకపాత్ర పోషించారు. తొలుత కెప్టెన్‌ సంజు శాంసన్‌(68నాటౌట్‌), రియాన్‌ పరాగ్‌(76) అద్భుత బ్యాటింగ్‌తో అలరించారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ దూకుడుగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (19 బంతుల్లో 24 పరుగులు) మొదటి మూడు ఓవర్లు చెలరేగి ఆడాడు. కానీ నాలుగో ఓవర్‌లో ఉమేశ్‌ యాదవ్‌ వేసిన బంతికి క్యాచ్‌ ఔటయ్యాడు. మరో ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ (10 బంతుల్లో 8 పరుగులు) విఫలమైనప్పటికీ.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్‌(38బంతుల్లో 68 పరుగులు) , రియాన్‌ పరాగ్‌ (48 బంతుల్లో 76 పరుగులు) పరుగుల వేటలో దుమ్ముదులిపేశారు. ఇద్దరూ చెరో హాఫ్‌ సెంచరీతో జట్టుకు కీలక స్కోర్‌ను అందించారు. అయితే వీళ్ల భాగస్వామ్యానికి 19వ ఓవర్‌లో బ్రేక్‌ పడింది. 18.4 ఓవర్‌కు మోహిత్‌ శర్మ వేసిన బంతికి పరాగ్‌ ఔటయ్యాడు. పరాగ్‌ ఔటయిన తర్వాత క్రీజులోకి వచ్చిన హెట్‌మయిర్‌ (5 బంతుల్లో 13పరుగులు ) కూడా ఫర్వాలేదనిపించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్‌ 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. భారీ ఛేదనలో గుజరాత్‌ ఓపెనర్లు సాయి సుదర్శన్‌(35), శుభ్‌మన్‌(72) తొలి వికెట్‌కు 64పరుగుల పునాది వేశారు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ రషీద్‌ ఖాన్‌కు లభించింది.

స్కోర్‌బోర్డు…
రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి)వేడ్‌ (బి)ఉమేశ్‌ 24, బట్లర్‌ (సి)తెవాటియా (బి)రషీద్‌ ఖాన్‌ 8, సంజు శాంసన్‌ (నాటౌట్‌) 68, రియాన్‌ పరాగ్‌ (సి)విజరు శంకర్‌ (బి)మోహిత్‌ శర్మ 76, హెట్‌మైర్‌ (నాటౌట్‌) 13, అదనం 7. (20 ఓవర్లలో 3వికెట్ల నష్టానికి) 196పరుగులు. వికెట్ల పతనం: 1/32, 2/42, 3/172 బౌలింగ్‌: ఉమేశ్‌ 4-0-47-1, జాన్సన్‌ 4-0-37-0, రషీద్‌ ఖాన్‌ 4-0-18-1, నూర్‌ అహ్మద్‌ 4-0-43-0, మోహిత్‌ 4-0-51-1.

గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌: సాయి సుదర్శన్‌ (ఎల్‌బి)కుల్దీప్‌ సేన్‌ 35, శుభ్‌మన్‌ (స్టంప్‌)సంజు (బి)చాహల్‌ 72, మాథ్యూ వేడ్‌ (బి)కుల్దీప్‌ సేన్‌ 4, అభినవ్‌ మనోహర్‌ (బి)కుల్దీప్‌ సేన్‌ 1, విజరు శంకర్‌ (బి)చాహల్‌ 16, రాహుల్‌ తెవాటియా (రనౌట్‌)బట్లర్‌/ఆవేశ్‌ ఖాన్‌ 22, షారుక్‌ ఖాన్‌ (ఎల్‌బి)ఆవేశ్‌ ఖాన్‌ 14, రషీద్‌ ఖాన్‌ (నాటౌట్‌) 24, నూర్‌ అహ్మద్‌ (నాటౌట్‌) 0, అదనం 11, (20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి) 199పరుగులు.

వికెట్ల పతనం: 1/64, 2/77, 3/79, 4/111, 5/133, 6/157, 7/195

బౌలింగ్‌: బౌల్ట్‌ 2-0-8-0, ఆవేశ్‌ ఖాన్‌ 4-0-48-1, కేశవ్‌ మహరాజ్‌ 2-0-16-0, అశ్విన్‌ 4-0-40-0, చాహల్‌ 4-0-43-2, కుల్దీప్‌ సేన్‌ 4-0-41-2.

➡️