భారత్‌ తొలి ప్రత్యర్ధి ఆస్ట్రేలియా

Jan 9,2024 08:36 #Foot Ball, #Sports
  • ఎఎఫ్‌సి ఆసియాకప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీ

కతార్‌: ఎఎఫ్‌సి ఆసియాకప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో భారత్‌కు క్లిష్టమైన డ్రా ఎదురైంది. మొత్తం 24జట్లు తలపడే ఈ టోర్నమెంట్‌లో భారత్‌ తన తొలి లీగ్‌ మ్యాచ్‌ను 12న పటిష్ట ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ టోర్నమెంట్‌కు చైనా ఆతిథ్యమివ్వాల్సి ఉన్నా.. కోవిడ్‌ కారణంగా అప్పట్లో ఈ టోర్నీని కతార్‌కు మార్పు చేయడం జరిగింది. 1956లో తొలిసారి కేవలం 4జట్లతో ప్రారంభమైన ఎఎఫ్‌సి టోర్నీ 2019లో అత్యధికంగా 24జట్ల మధ్య జరిగింది. ఈసారి కూడా 24జట్లు టైటిల్‌కు తలపడనున్నాయి. 12న ఆతిథ్య కతార్‌-లెబనాన్‌ జట్ల మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో ఈ టోర్నీ ప్రారంభం కానుండగా.. భారత్‌ తన తొలి గ్రూప్‌ లీగ్‌ మ్యాచ్‌ను 13న పటిష్ట ఆస్ట్రేలియాతో ఆడనుంది. గ్రూప్‌ లీగ్‌ పోటీలు ముగిసిన అనంతరం గ్రూప్‌ టాప్‌-2 జట్లు నాకౌట్‌కు చేరనున్నాయి. జనవరి 12నుంచి 25వరకు గ్రూప్‌ స్టేజ్‌ పోటీలు 28నుంచి, 21వరకు ప్రి క్వార్టర్స్‌, ఫిబ్రవరి 2, 3న క్వార్టర్‌ఫైనల్స్‌, 6, 7న సెమీఫైనల్‌ జరగనుండగా.. 10న లాసైల్‌ స్టేడియంలో ఫైనల్‌ పోరు జరగనుంది.

గ్రూప్‌-ఎ : కతార్‌, చైనా, తజకిస్తాన్‌, లెబనాన్‌

గ్రూప్‌-బి : ఇండియా, ఆస్ట్రేలియా, ఉజ్బెకిస్తాన్‌, సిరియా

గ్రూప్‌-సి : ఇరాన్‌, యుఏఇ, హాంకాంగ్‌, పాలస్తీనా

గ్రూప్‌-డి : జపాన్‌, ఇండోనేషియా, ఇరాక్‌, వియత్నాం

గ్రూప్‌-ఇ : దక్షిణ కొరియా, మలేషియా, జోర్డాన్‌, బహ్రైయిన్‌

గ్రూప్‌-ఎఫ్‌: సౌదీ అరేబియా, థాయ్ లాండ్‌, కిర్గిజిస్తాన్‌, ఓమన్‌

భారత్‌ తలపడే మ్యాచ్‌ల షెడ్యూల్‌..

13(శని) : భారత్‌ × ఆస్ట్రేలియా(సా.5.00గం||)

18(గురు) : భారత్‌ × ఉబ్జెకిస్తాన్‌(రా.8.00గం||)

23(మంగళ) : భారత్‌ × సిరియా(సా.5.00గం||)

➡️