బంగ్లా జట్టుపై అమెరికా సంచలన విజయం

May 22,2024 17:47 #Cricket, #Sports

2024 టీ20 వరల్డ్‌ కప్‌ ముందు బంగ్లాదేశ్‌ జట్టు అమెరికా టూర్‌కి వెళ్ళింది. ఇందులో భాగంగా జరిగిన మొదటి టీ20లో అమెరికా జట్టు బంగ్లాదేశ్‌ జట్టుపై గెలిచిన సంచలనం సృష్టించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెటిచిన అమెరికా జట్టు మొదట బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో బంగ్లాదేశ్‌ మొదట బ్యాటింగ్‌ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. అనంతరం 154 పరుగుల లక్ష్యంతో చేజింగ్‌కు దిగిన అమెరికా జట్టు.. 19.3 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. యూఎస్‌ఏ బ్యాటర్లు స్టీవెన్‌ టేలర్‌(28), ఆండ్రీస్‌ గౌస్‌(23) ఓ మోస్తరుగా రాణించగా ఆరు, ఏడు స్థానాల్లో వచ్చిన కోరే ఆండర్సన్‌(25 బంతుల్లో 34 నాటౌట్‌), హర్మీత్‌ సింగ్‌ దంచికొట్టారు. ముఖ్యంగా హర్మీత్‌ కేవలం 13 బంతుల్లోనే 33 పరుగులు సాధించి జట్టును గెలుపుతీరాలకు చేర్చాడు. ఈ విజయంతో బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో యూఎస్‌ఏ 1-0తో ముందంజ వేసింది. కాగా ఇంటర్నేషనల్‌ టీ20లో అమెరికా జట్టు బంగ్లాదేశ్‌ జట్టుపై విజయం సాధించడం ఇదే మొదటి సారి కావడం విశేషం.

➡️