జకోవిచ్‌ మరో రికార్డు

Apr 8,2024 22:34 #Djokovic, #record, #Sports, #Tennis
  • 36ఏళ్ల వయసులో టాప్‌ర్యాంక్‌లో నిలిచి ఫెదరర్‌ రికార్డు బ్రేక్‌

లాసన్నె: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య(ఎటిపి) విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో నొవాక్‌ జకోవిచ్‌ మరోసారి టాప్‌ర్యాంక్‌లో నిలిచి రికార్డు నెలకొల్పాడు. ఎటిపి సోమవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో సెర్బియాకు చెందిన 36ఏళ్ల నొవాక్‌ జకోవిచ్‌ మరోసారి అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో అత్యధిక వయసులో టాప్‌ ర్యాంక్‌లోనిలిచి ఫెదరర్‌ను వెనక్కి నెట్టాడు. ఇక బెన్‌ షెల్టన్‌ క్లేకోర్ట్‌ టైటిల్‌ను చేజిక్కించుకొని 230 సంపాదించి తొలిసారి టాప్‌-15లో చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం షెల్టన్‌ ఖాతాలో 2,490పాయింట్లు ఉన్నాయి. ఫైనల్లో షెల్టన్‌ 7-5, 4-6, 6-3తో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ టియాఫోను చిత్తుచేశాడు. 2022లో షెల్టన్‌ 90వ ర్యాంక్‌లో ఉండగా.. రెండేళ్లలో అత్యుత్తమ ర్యాంక్‌ 14వ ర్యాంక్‌కు ఎగబాకడం విశేషం.

➡️