ఇంగ్లండ్‌ను కూల్చిన అశ్విన్‌

Jan 26,2024 10:43 #Sports
  • 246 పరుగులకే పరిమితం
  • స్టోక్స్‌ అర్ధసెంచరీ
  • భారత్‌ 119/1

హైదరాబాద్‌ : ఉప్పల్‌ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్‌ 246 పరుగులకే ఆలౌటయ్యింది. భారత స్పిన్నర్లు విజంభించడంతో స్టోక్స్‌ సేన మొదటి రోజే మూడో సెషన్‌లో కుప్పకూలింది. కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడిన బెన్‌ స్టోక్స్‌(70)ను బుమ్రా బౌల్డ్‌ చేయడంతో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. భారత బౌరర్లలో జడేజా మూడు, అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, బుమ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు. రెండేండ్లేగా బాజ్‌ బాల్‌ ఆటతో ప్రత్యర్థులను వణికిస్తున్న ఇంగ్లండ్‌ బ్యాటర్లు భారత గడ్డపై తేలిపోయారు. లంచ్‌ తర్వాత తడబడిన ఇంగ్లండ్‌ జట్టు టీ సమయానికి 215 స్కోర్‌ చేసింది. భారత స్పిన్‌ త్రయం రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌ విజంభణతో.. ఒకదశలో రెండొందల లోపే ఆలౌట్‌ అవుతుందునుకున్న జట్టును అతడు మార్క్‌ వుడ్‌(7 నాటౌట్‌), టామ్‌ హర్ట్లే(23)తో కలిసి విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. దాంతో, టీ టైమ్‌కి ఇంగ్లండ్‌ 8 వికెట్ల నష్టానికి 215 పరుగులు కొట్టింది. సొంతగడ్డపై బాజ్‌ బాల్‌ ఆటతో యాషెస్‌ సిరీస్‌ సమం చేసుకున్న ఇంగ్లండ్‌ జట్టు భారత గడ్డపై తేలిపోయింది. తొలి సెషన్‌లోనే ఓపెనర్లు జాక్‌ క్రాలే(18), బెన్‌ డకెట్‌(35)లతో పాటు ఓలీ పోప్‌(1)లు ఔట్‌ కావడంతో.. ఇంగ్లండ్‌ను జానీ బెయిర్‌స్టో(37), జో రూట్‌(29) ఆదుకున్నారు. కానీ, లంచ్‌ తర్వాత అక్షర్‌ పటేల్‌ డేంజరస్‌ బెయిర్‌స్టోను బౌల్డ్‌ చేశాడు. ఆ కాసేపటికే జడ్డూ బౌలింగ్‌లో రూట్‌ తనకు అచ్చొచ్చిన స్వీప్‌ షాట్‌ ఆడి బుమ్రాకు క్యాచ్‌ ఇచ్చాడు. దాంతో, 137 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన సమయంలో యంగ్‌స్టర్‌ టామ్‌ హర్ట్లే(23) ధనాధన్‌ ఆడి స్టోక్స్‌పై ఒత్తిడిని తగ్గించాడు. హర్ట్లే ఔటయ్యాక గేర్‌ మార్చిన స్టోక్స్‌ హాఫ్‌ సెంచరీతో స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే.. మరో ఎండ్‌లో సహకారం లభించకపోవడంతో ఇంగ్లండ్‌ 246 రన్స్‌కే పరిమితమైంది.

స్కోర్‌బోర్డు…

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: క్రాలే (సి)సిరాజ్‌ (బి)అశ్విన్‌ 20, డక్కెట్‌ (ఎల్‌బి)అశ్విన్‌ 35, పోప్‌ (సి)రోహిత్‌ (బి)జడేజా 1, రూట్‌ (సి)బుమ్రా (బి)జడేజా 29, బెయిర్‌స్టో (బి)అక్షర్‌ 37, స్టోక్స్‌ (బి)బుమ్రా 70, ఫోక్స్‌ (సి)శ్రీకర్‌ భరత్‌ (బి)అక్షర్‌ 4, రేహన్‌ అహ్మద్‌ (సి)శ్రీకర్‌ భరత్‌ (బి)బుమ్రా 13, హార్ట్లీ (బి)జడేజా 23, మార్క్‌ వుడ్‌ (బి)అశ్విన్‌ 11, లీచ్‌ (నాటౌట్‌) 0, అదనం 3. (64.3ఓవర్లలో) 246పరుగులకు ఆలౌట్‌. వికెట్ల పతనం: 1/55, 2/58, 3/60, 4/121, 5/125, 6/137, 7/155, 8/193, 9/234, 10/246 బౌలింగ్‌: బుమ్రా 8.3-1-28-2, సిరాజ్‌ 4-0-28-0, జడేజా 18-4-88-3, అశ్విన్‌ 21-1-68-3, అక్షర్‌ 13-1-33-2.ఇండియా తొలి ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (బ్యాటింగ్‌) 76, రోహిత్‌ శర్మ (సి)స్టోక్స్‌ (బి)లీచ్‌ 24, శుభ్‌మన్‌ గిల్‌ (బ్యాటింగ్‌) 14, అదనం 5. (23ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 119పరుగులు. వికెట్ల పతనం: 1/80 బౌలింగ్‌: మార్క్‌ వుడ్‌ 2-0-9-0, హార్ట్లీ 9-0-63-0, లీచ్‌ 9-2-24-1, రెహాన్‌ అహ్మద్‌ 3-0-22-0

➡️