చివరి రెండు టీ20లకు జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా

Nov 28,2023 15:36 #Australia, #Cricket, #Sports

వరల్డ్‌ కప్‌ ముగిశాక టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు రెండు టీ20 మ్యాచ్‌లు జరగ్గా… రెండింట్లోనూ నెగ్గిన టీమిండియా సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో ఉంది. కాగా, వరల్డ్‌ కప్‌ ఆడేందుకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టు గత రెండు నెలలుగా భారత్‌ లోనే ఉంది. ఈ నేపథ్యంలో, టీ20 జట్టులోని పలువురు ఆసీస్‌ ఆటగాళ్లు స్వదేశానికి వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో, చివరి రెండు టీ20లకు ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు తమ జట్టును ప్రకటించింది.ఆస్ట్రేలియా జట్టు…మాథ్యూ వేడ్‌ (కెప్టెన్‌), ట్రావిస్‌ హెడ్‌, ఆరోన్‌ హార్డీ, బెన్‌ మెక్‌ డెర్మట్‌, టిమ్‌ డేవిడ్‌, జోష్‌ ఫిలిప్పే, తన్వీర్‌ సంఘా, బెన్‌ డ్వార్షూయిస్‌, నాథన్‌ ఎల్లిస్‌, క్రిస్‌ గ్రీన్‌, కేన్‌ రిచర్డ్సన్‌, జాసన్‌ బెహ్రెండార్ఫ్‌.

➡️