డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా టాప్‌

Jan 6,2024 14:40 #Australia, #Cricket, #Sports, #test match

వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ (డబ్ల్యూటీసీ) 2023-2025 పాయింట్ల పట్టికలో ఆసీస్‌ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. సిడ్నీ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మూడో టెస్టులో 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో ఆసీస్‌ క్లీన్‌ స్వీప్‌ చేసింది. దీంతో ఆసీస్‌ జట్టు 56.25 శాతం పాయింట్లతో టాప్‌ ప్లేస్‌కు చేరుకుంది. ఇప్పటివరకు టాప్‌ ప్లేస్‌లో ఉన్న భారత్‌ (54.16 శాతంతో) రెండో స్థానానికి పడిపోయింది. భారత్‌ తర్వాతి స్థానాల్లో బాకింది. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ (50.0), బంగ్లాదేశ్‌ (50.0) పాకిస్తాన్‌ (45.83) కొనసాగుతున్నాయి.

➡️